పెంచుకుంటున్న కుక్కల్ని చంపి... ఆత్మహత్య చేసుకున్న యువకుడు... ఎందుకంటే...
West Bengal : ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. రెండు కుక్కల్ని ఎందుకు చంపాడు. తను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు. అని అంతా ఒకర్నొకరు ప్రశ్నించుకున్నారు.

ఆత్మహత్య చేసుకున్న సువంకర్
- News18 Telugu
- Last Updated: July 18, 2019, 1:25 PM IST
అది బెంగాల్‌లోని జయనగర్‌లో ఉన్న నారాయణ్ తాలా. అక్కడ తన భార్య షంపా రాయ్ చౌదరితో హాయిగా జీవించేవాడు సువంకర్ రాయ్ చౌదరి. వాళ్లది ఎంత చక్కటి కుటుంబమంటే... పెంచుకోవడానికి మేలు జాతి కుక్కలైన జర్మన్ షెపర్డ్, స్పానియల్ని తెచ్చాడు. ఆటో నడుపుతూ వచ్చిన డబ్బుతో కావాల్సిన సామాన్లు కొనుక్కుంటూ... భార్యతో కలిసి చక్కగా జీవించేవాడు. ఐతే... రాన్రానూ ఆటోపై వచ్చే డబ్బు సరిపోదనిపించింది సువంకర్కి ఓవైపు ఆటో నడుపుతూనే... ఇంటి దగ్గర కిరాణా షాపు పెట్టాలని అనుకున్నాడు. ఈ రోజుల్లో కిరాణా షాప్ అంటే మాటలా... లక్షలు కావాలి. ఆటోపై వచ్చే డబ్బులతో షాపు పెట్టడం కుదరని పని అనుకున్న సువంకర్... ఆ ఊళ్లోని ఓ గ్యాంగ్ దగ్గర అప్పు చేశాడు. ఆ డబ్బుతో ఇంటికి వచ్చాడు. ఐతే... అదే సమయంలో ఆటో పనిచేయడం మానేసింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. అది ఎమర్జెన్సీ కావడంతో... ఆ డబ్బుతో ఆటోను రిపేర్ చేయించాడు.
మిగిలిన కాస్త డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చెయ్యడం కరెక్టు కాదనుకున్న సువంకర్... ఆటో తోలి.. మరింత డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అతని దురదృష్టం కొద్దీ... ఆటో మళ్లీ మళ్లీ రిపేర్లు పెట్టింది. వాటిని సరిచేసేందుకు ఉన్న డబ్బు కూడా అయిపోయింది. డబ్బు అప్పు ఇచ్చిన గ్యాంగ్... వడ్డీతో సహా చెల్లించాలంటూ వేధించడం మొదలుపెట్టింది. చేతిలో డబ్బు లేదు. వడ్డీ కొండలా పెరిగిపోతోంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు సువంకర్కి. పదే పదే అప్పులోళ్లు కాల్స్ చేసి బెదిరిస్తుంటే... పిచ్చెక్కినట్లు ఫీలయ్యాడు.
ఆ పరిస్థితుల్లో మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఓ రోజు పిచ్చి కోపంలో ఉన్నప్పుడు... రెండు కుక్కలూ ఇష్టమొచ్చినట్లు అరవడం మొదలుపెట్టాయి. వాటిని సైలెంట్ చెయ్యడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఆ టైంలో అప్పుల గ్యాంగ్ ఇంటికొచ్చింది. భార్యాభర్తలిద్దర్నీ బూతులు తిడుతూ... ఆటోని పట్టుకుపోయింది. వాళ్లను ఆపడం సువంకర్ వల్ల కాలేదు. అంతే... అతనికి టెన్షన్ పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది. అదే సమయంలో కుక్కలు తెగ మొరుగుతుంటే... కోపంతో... ఇంట్లోకి వెళ్లి... తన తండ్రి కాలం నాటి రైఫిల్ తెచ్చి... రెండు కుక్కల్నీ కాల్చిపారేశాడు.
ఆ తర్వాత... తను ఏం చేసిందీ తెలుసుకొని షాకయ్యాడు. ఆటో, డబ్బులు, బిజినెస్, అప్పులు, కుక్కలు అన్నీ సినిమా రీల్లా మైండ్‌లో తిరిగాయి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ మెంటల్ టెన్షన్లో అదే రైఫిల్‌తో తనను తాను తలలోకి కాల్చేసుకున్నాడు. క్షణాల్లో చనిపోయాడు. చుట్టుపక్కల వాళ్లంతా షాకయ్యారు. ఇక సువంకర్ భార్య నోట మాట లేదు. ఏం చెయ్యాలో ఆమెకూ అర్థం కాని పరిస్థితి. పోలీసులు కేసు రాసి, దర్యాప్తు చేస్తున్నారు.
మిగిలిన కాస్త డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చెయ్యడం కరెక్టు కాదనుకున్న సువంకర్... ఆటో తోలి.. మరింత డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అతని దురదృష్టం కొద్దీ... ఆటో మళ్లీ మళ్లీ రిపేర్లు పెట్టింది. వాటిని సరిచేసేందుకు ఉన్న డబ్బు కూడా అయిపోయింది. డబ్బు అప్పు ఇచ్చిన గ్యాంగ్... వడ్డీతో సహా చెల్లించాలంటూ వేధించడం మొదలుపెట్టింది. చేతిలో డబ్బు లేదు. వడ్డీ కొండలా పెరిగిపోతోంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు సువంకర్కి. పదే పదే అప్పులోళ్లు కాల్స్ చేసి బెదిరిస్తుంటే... పిచ్చెక్కినట్లు ఫీలయ్యాడు.

సువంకర్ చేతిలో చనిపోయిన కుక్క
లైంగిక వాంఛ తీర్చమని మేనత్తను వదలని 18 ఏళ్ల యువకుడు..షాకింగ్
మళ్లీ నలుగురు మృగాళ్లే...యువతిపై గ్యాంగ్ రేప్ చేసి..వీడియో తీసి బ్లాక్ మెయిల్..
దిశ కేసు... మానవ హక్కుల కార్యకర్తలకు పోలీసుల ఫోన్?
ఆయేషా తల్లి వ్యాఖ్యలపై స్పందించిన రోజా
దిశ నిందితుల మృతదేహాలకు ఇస్తున్న... ఇంజక్షన్ ధర ఎంతో తెలుసా ?
ఆయేషా పుర్రె, అస్థికలపై గాయాలు... రీపోస్టుమార్టంలో గుర్తించిన సీబీఐ