హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: నమ్మి లిఫ్ట్ అడిగిన మహిళపై రేప్.. పోలీసులు వస్తున్నారన్న భయంతో నిందితుడు ఏం చేశాడంటే..

Telangana: నమ్మి లిఫ్ట్ అడిగిన మహిళపై రేప్.. పోలీసులు వస్తున్నారన్న భయంతో నిందితుడు ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నమ్మి లిఫ్ట్ అడిగిన పాపానికి ఓ వ్యక్తి వివాహితపై దారుణానికి పాల్పడ్డాడు. అయితే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయపడ్డాడు. భయంతో తండా శివారులోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

నమ్మి లిఫ్ట్ అడిగిన పాపానికి ఓ వ్యక్తి వివాహితపై దారుణానికి పాల్పడ్డాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించి, అఘాయిత్యానికి పాల్పడి పరారయ్యాడు. అయితే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయపడ్డాడు. భయంతో తండా శివారులోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పెద్దూర్‌తండాకు చెందిన శంకర్‌ (22) బోరు మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం తండా నుంచి తన ద్విచక్ర వాహనంపై ఆమనగల్లు వెళ్తుండగా చీపునుంతల శివారులో ఓ వివాహిత శంకర్ ను ఆపి కొంచెం లిఫ్ట్ ఇవ్వాలని కోరింది. శంకర్‌ బైక్ ఆపి ఆమెను ఎక్కించుకున్నాడు. శంకర్‌ ఆ మహిళను చుక్కాపూర్‌ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తర్వాత బెదిరించి అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు.

దీంతో బాధిత మహిళ మహిళ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమెను పెద్దూర్‌తండాకు తీసుకువెళ్ళారు. దీంతో పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న శంకర్‌ భయంతో తండా శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఓ వ్యక్తి తన పొరుగింటి వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశాడు. తన భార్యతో సెక్సువల్‌గా సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ సట్నా జిల్లాలోని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బమ్హంది గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామంలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన సజ్జు అనే వ్యక్తిని తన పొరుగింట్లో ఉంటున్న మహేష్‌ను తన ఇంటికి రావొద్దని కోరాడు. మహేష్ తన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో సజ్జు అతడిని హెచ్చరించాడు. అయితే ఆ మాటలను పట్టించుకోని మహేష్ మంగళవారం సాయంత్రం సజ్జు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో సజ్జు, మహేష్‌ల మధ్య మాట మాట పెరిగింది.

ఇది కాస్తా వారిద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఆ సమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన సజ్జు ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని మహేష్‌పై దాడి చేశాడు. దీంతో మహేష్ మృతిచెందాడు. ఇక, ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న సట్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధరమ్‌వీర్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్టు రామ్‌నగర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ హిమాలి సోని తెలిపారు.

First published:

Tags: Rangareddy, Rape case, Telangana, Telangana Police

ఉత్తమ కథలు