• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN COMMITS SUICIDE OVER WIFE REFUSES LIVING WITH HIM AT KAMAREDDY VB NZB

Telangana: ఆయువు తీసిన అనుమానం.. పెళ్లైన 12 ఏళ్లకు ఇలా జరిగిందేంటి..

Telangana: ఆయువు తీసిన అనుమానం.. పెళ్లైన 12 ఏళ్లకు ఇలా జరిగిందేంటి..

ప్రతీకాత్మక చిత్రం

Man commits suicide: కలిసిమెలసి సంతోషంగా ఉండాల్సిన దంపతులు .. కుటుంబ కలహాలతో కాపురాలను విచ్చిన్నం చేసుకుంటున్నారు. భార్య పై అనుమానం పెను భూతంగా మారి తను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

  • Share this:
    మ‌నిషి మ‌నుగ‌డ‌లో అన్ని బంధాలు ర‌క్త‌సంబంధంతో ముడిపడి ఉంటాయి. కానీ భార్యాభర్తల బంధం న‌మ్మ‌కం పై నిల‌బ‌డుతుంది. ఎక్క‌డో పుట్టి ఎక్క‌డో పెరిగి పెళ్లి ఆనే బంధంతో భ‌ర్త ఇంటికి వ‌స్తుంది భార్య‌. క‌న్న‌వారిని కాద‌ని భ‌ర్త కొసం తెలియ‌ని చోటుకు వ‌చ్చి ఆంద‌రి మ‌న్న‌నలు పొందుతూ త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకుంటుంది. అలాంటి స్త్రీ ని ఆనుమానం అనే భూతం కార‌ణంగా ప‌చ్చ‌ని సంసారంలో చిచ్చుపెట్టుకుంటారు. చివరికి ఎవ‌రో ఒక‌రు ప్రాణాలు విడుస్తారు. తాజాగా భార్య కాపురానికి రాక‌పోవ‌డంతో భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం గున్కుల్‌ గ్రామానికి చెందిన దేవునిపల్లి స్వప్నకు, సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం మిర్ఖాన్‌పేట్‌ గ్రామానికి చెందిన మొగిలి బాలయ్యతో వివాహం జరిగింది. స్వప్న, బాలయ్యల 12 సంవ‌త్స‌రాల కాపురానికి ముగ్గురు సంతానం ఉంది.

    గ‌త కొంతకాలంగా దంపతుల మ‌ధ్య ఆనుమానం అనే పేను భూతం వ‌చ్చింది. దీంతో అప్ప‌టి నుంచి వారి కాపురంలో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. పలుమార్లు కేసులు పెట్టుకున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జ‌రిగింది. పెద్ద‌లు ఇద్ద‌రి మ‌ధ్య స‌యోద్య కుదిరించినా వారి మధ్య గొడ‌వ‌లు మాన‌లేదు. దీంతో స్వప్న కాపురానికి పోలేక త‌ల్లి గారి ఇంటి వ‌ద్ద‌నే ఉంటుంద. అయితే ఈ నెల 6న భర్త మొగిలి బాలయ్య గున్కుల్‌ గ్రామానికి వచ్చి భార్య స్వ‌ప్న‌ను ఇంటికి వెళ దామని అన్నాడు.. దీంతో స్వప్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర పదజాలం తో దూషించడంతో బాలయ్య క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అపస్మారక స్థితిలో కొట్టు మిట్టాడుతున్న బాల‌య్య‌ను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలయ్య మృతి చెందాడు.

    దీంతో మృతుని తండ్రి పీరయ్య ఫిర్యాదుతో నిజాంసాగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, శవ పంచనామా నిర్వహించి, దర్యాప్తు చేస్తున్నారు. మొగిలి బాలయ్య గ్రామస్థులు, బధువుల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా స్వప్న కాపురానికి రాలేక పోయిందని ఎస్సై తెలిపారు. పీరయ్య ఫిర్యాదులో స్వప్నకు వివాహేతర సంబంధం కారణంగానే మా కుమారుడు బాలయ్య ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడని తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు