Online Rummy: ఆన్‌లైన్ రమ్మీకి మరో వ్యక్తి బలి.. రైలు కింద పడి ఆత్మహత్య

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారి ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ రమ్మీ వంటి బెట్టింగ్ యాప్స్ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.

news18-telugu
Updated: November 15, 2020, 6:24 PM IST
Online Rummy: ఆన్‌లైన్ రమ్మీకి మరో వ్యక్తి బలి.. రైలు కింద పడి ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారి ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ రమ్మీ వంటి బెట్టింగ్ యాప్స్ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో ఆన్‌లైన్ రమ్మీ బానిసగా మారి.. పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. వివరాలు.. విశాఖలోని గోపాలపట్నం కొత్తపాలెంకు చెందిన నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి మద్దాల సతీష్ ఆన్‌లైన్ రమ్మీని వ్యసనంగా చేసుకున్నాడు. ఇందులో భారీగా డబ్బులు పెట్టాడు. ఆన్‌లైన్ జూదంలో దాదాపు 25 లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన సతీష్ బలవనర్మణానికి పాల్పడ్డాడు. మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే సతీష్ గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో అతని కుటుంబసభ్యులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సతీష్ ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు రైల్వే ట్రాక్‌పై అతని మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రైల్వే హాస్పిటల్‌కు తరలించారు.

కాగా, సతీష్‌కు భార్య ప్రత్యూష, కుమార్తె సాయి మోక్షిత ఉన్నారు. సతీష్ మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక, ఈ  కేసు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Published by: Sumanth Kanukula
First published: November 15, 2020, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading