Andhra Pradesh: ఆన్ లైన్ రమ్మీలో అప్పుల పాలు.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ప్రతీకాత్మక చిత్రం

Online Rummy: సరదా వ్యవసనమైంది. ఆ వ్యసనం అప్పుల పాలు చేసింది. సాఫీగా సాగుతున్న జీవనం తలకిందులైంది.

  • Share this:
    సరదాగా ఆడిన ఆట వ్యవసనమైంది. ఆ వ్యసనం అప్పుల పాలు చేసింది. సాఫీగా సాగుతున్న జీవనం తలకిందులైంది. ఇంకేముంది భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెంది ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం, పాతలపాడు గ్రామానికి చెందిన గాయం కోటిరెడ్డి.. హైదరాబాద్ శివారులోని బాచుపల్లిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ఆన్ లైన్ రమ్మీ ఆడుతున్న కోటిరెడ్డి.. క్రమంగా దానికి బానిసయ్యాడు. వచ్చిడబ్బంతా రమ్మీలోనే పెట్టి నష్టపోయాడు. అక్కడితో ఆగకుండా రూ.4లక్షలు అప్పులు చేశాడు. ఉన్నదంతా రమ్మీలోనే పొగొట్టుకోవడంతో భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు. క్రమంగా మద్యానికి బానిసవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో భార్య గొడవపడి ఈ నెల 8న గొడవపడి వెళ్లిపోయింది.

    భార్య పుట్టింటింకి వెళ్లిపోవడం, డబ్బులు నష్టపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టింటి నుంచి భార్య ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో దగ్గర్లోనే ఉన్న బాబాయి చంద్రశేఖర్ రెడ్డికి సమాచారమిచ్చింది. దీంతో వారు ఇంటికొచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో అతడు అమీన్ పూర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    ఇటీవల ఆన్ లైన్ రమ్మీలు, రుణ యాప్ లతో అప్పులు చేసి ఉన్నదంతా పొగొట్టుకున్న వారి ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో మంచిర్యాల జిల్లాలోని సీసీసీ నస్పూర్‌కు చెందిన సీపతి అభిలాష్‌ (25) సీఏ చదువుతున్నాడు. అయితే అతడు ఆన్లైన్లో రమ్మి ఆటకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో అతడు ఆ ఆటకు బానిసగా మారాడు. దీంతో లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇరవై రోజుల క్రితం ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. అనంతరం ఆదివారం తిరిగి వచ్చి మంచిర్యాలలోని సాయికుంట.. గోదావరి తీరంలో విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు.
    Published by:Purna Chandra
    First published: