హోమ్ /వార్తలు /క్రైమ్ /

మార్నింగ్ వాక్ లో పరిచయం.. ప్రేమ.. కోటి రూపాయలు కావాలని ప్రియురాలి డిమాండ్.. కారణం ఏంటంటే

మార్నింగ్ వాక్ లో పరిచయం.. ప్రేమ.. కోటి రూపాయలు కావాలని ప్రియురాలి డిమాండ్.. కారణం ఏంటంటే

వారిద్దరికి మార్నింగ్ వాక్ లో పరిచయం ఏర్పడింది. ప్రతిరోజు ఒకరిని మరొకరు కలుసుకునేవారు. ఈ క్రమంలో వీరిమధ్య చనువు పెరిగింది. మాటలు కలిశాయి. అది స్నేహంగా మారింది. ఆ తర్వాత అది కాస్త ప్రేమకు దారితీసింది.ఈ క్రమంలో ప్రియురాలు తనకు ఒకకోటి రూపాయలు కావాలని డిమాండ్ చేసింది..

ఇంకా చదవండి ...

Love Tragedy:  ఈ మధ్య కాలంలో యువత ప్రేమకు  సంబంధించిన పలు విషాదాలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. కొన్ని చోట్ల తాము.. ప్రేమించిన వారు తమ ప్రేమను అంగీకరించలేదని వారిపై అఘాయిత్యాలకు, హత్యలకు పాల్పడుతున్నారు. మరికొన్నిచోట్ల ప్రేమికులు (Lovers) తమ ప్రేమను ఎదుటివారు అంగీకరించలేదని ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో కన్నవారికి తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నారు.

కొందరు తమ అవసరాల కోసం ఎదుటివారిని ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారు. ఆ తర్వాత.. వీరి బలహీనతను ఆసరాగా చేసుకొని వారిని తమ అవసరాల కోసం పావుగా వాడుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వార్తలలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన గుజరాత్ లో సంభవించింది. ఇద్దరు యువతీయువకుల మధ్య ప్రేమ చిగురించింది.

ఆ తర్వాత.. కొన్నిరోజులకు యువతీ తాను.. ఉన్నత చదువులకు కెనడా వెళ్తానని తెలిపింది. దానికి ఒక కోటి కావాలని కోరింది. దీనికి నిరాకరించటడంతో ఆమె అతడిని దూరం పెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజుకు వీరిమధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో లఖన్ మఖిజా ఇంట్లో ఈ నెల 21న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసుల ప్రకారం.. ఈ సంఘటన అహ్మదాబాద్ (Ahmedabad) లోని నానా చిలోడాలోని కైలాష్ రాయల్ అపార్ట్ మెంట్ లో జరిగింది. లఖన్ మఖియా తన కుటుంబంతో కలిసి ఈ అపార్ట్ మెంట్ లో ఉండేవాడు. వీరు వ్యాపారం చేసుకుంటు ఉండేవారు. ఈ క్రమంలో లఖన్ మఖియా ప్రతిరోజు సమీపంలోని పార్కుకు వాకింగ్ ( Park For Walking)కు వెళ్తుండేవాడు. దీంతో అతనికి ఒక యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కొన్ని రోజులకు యువతి తాను.. కెనడా (Canada) వెళ్తానని చెప్పింది. దీనికి వీసా దరఖాస్తు తదితరాలకు ఒక కోటి ఖర్చవుతుందని తెలిపింది. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వలేనని చెప్పాడు.

డబ్బుల ప్రస్తావన ఇంట్లో కూడా తీసుకొచ్చాడు. ఇవ్వలేమని లఖన్ మఖియా తన ప్రియురాలికి (Girl Friend Demands 1Crore) చెప్పాడు. దీంతో ఆమె అప్పటి నుంచి లఖన్ ను దూరం పెడుతూ వచ్చింది. దీంతో అతను తీవ్రంగా కుంగిపోయాడు. వీరిమధ్య చాలా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో యువతి.. తనకు డబ్బులు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారని తెలిపింది. నీ ప్రేమ (Girl Refuses to Marry) అక్కర్లేదని తేల్చిచెప్పింది. ఆమెపైనే ప్రాణాలు పెట్టుకున్న అతను.. తట్టుకోలేక ఈనెల 21న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

దీంతో బాధితుడి తల్లి, సోదరుడు యువతి వేధింపుల వలనే తమ కొడుకు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రకారం.. బాధితుడి తల్లి, సోదరుడు సందీప్ లఖియా ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదుచేశామని తెలిపారు. అదే విధంగా వీరి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను ప్రూఫ్ లుగా ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అయితే, సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకులేదని చనిపోయిన వ్యక్తి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కావాలనే ప్రూఫ్ లను తారు మారుచేసే ప్రయత్నంచేస్తున్నారని ఆరోపించారు. కొన్ని వాట్సాప్ సందేశాలను తొలగించరని లఖన్ మఖియా తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

First published:

Tags: Ahmedabad, Crime news, Love cheating, Love failure, Marriage

ఉత్తమ కథలు