Hyderabad: అత్తారింట్లో అవమానం.. స్తంభానికి కట్టేసి మరీ కొట్టడంతో కూతురు పుట్టి నెల రోజులు కూడా కాకముందే..

లక్ష్మణ్ (ఫైల్ ఫొటో)

ఆమెకు గతంలోనే పెళ్లయిందనీ, విడాకులు కూడా తీసుకుందని తెలిసినా ఆమెనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కూతురు పుట్టి నెల రోజులు కూడా కాకముందే..

  • Share this:
    పాప పుట్టి సరిగ్గా నెల కూడా కాలేదు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఆ పాప తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్తింట్లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పూనుకున్నాడు. భార్య కూడా తన వైపు మాట్లాడకపోవడంతో మనస్తాపానికి గురయి ఈ దారుణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ నగర్ సమీపంలోని టీ అంజయ్య నగర్ కు చెందిన నగేష్, మల్లమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దుష్ముక్ లక్ష్మణ్ పెయింటర్ గా పనిచేస్తున్నాడు. ఎల్లమ్మబండలో ఉండే మేనత్త ఇంటికి వెళ్లినప్పుడు భవానీ అనే యువతిని చూసి ప్రేమించాడు. ఆమెకు అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకుని ఉంటోందని తెలిసింది.

    అయినప్పటికీ ఆమెను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. 2020వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లక్ష్మణ్, స్వప్న పెళ్లి జరిగింది. పెళ్లయిన మరుసటి రోజు నుంచే భర్త లక్ష్మణ్ తో స్వప్న గొడవపడేది. నెల రోజుల తర్వాత పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తీసుకొస్తానంటూ వెళ్లిన లక్ష్మణ్ కూడా స్వప్న ఒత్తిడితో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అత్తారింట్లోనే ఉంటూ పనికి వెళ్తూ భార్యను పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా లక్ష్మణ్ సరిగా పనికి వెళ్లడం లేదని ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. మార్చి 10వ తారీఖున స్వప్న ఓ పాపకు జన్మనిచ్చింది. అదే నెల 31 వ తారీఖున 21వ రోజు కార్యక్రమం జరిగింది.

    ఈ కార్యక్రమంలోనే లక్ష్మణ్ కు చేదు అనుభవం ఎదురయింది. పనికి ఎందుకు వెళ్లడం లేదంటూ అత్తారింట్లో అంతా నిలదీశారు. అంతేకాకుండా స్తంభానికి కొట్టేసి కొట్టారు కూడా. అందరిముందు తనను అత్తింటి వాళ్లు కొట్టడంతో పరువు పోయినట్టు భావించాడు. ఏప్రిల్ 1వ తారీఖున పారిపోయి లింగంపల్లిలో ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు రక్షించి అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పి లక్ష్మణ్ వాపోయాడు. ఆ తర్వాతి రోజు తమ్ముడికి ఫోన్ ఇచ్చి వస్తానంటూ వెళ్లాడు. మళ్లీ కనిపించలేదు. లక్ష్మణ్ ఇంటి సమీపంలోనే ఉండే అతడి చిన్నమ్మ ఇంటి వద్ద సెల్లార్ లో లక్ష్మణ్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో వేలాడుతూ కనిపించింది. దీంతో ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ్ అత్తింటి వాళ్లే ఈ ఘటనకు కారణమని మృతుడి తండ్రి వాపోతున్నాడు.
    Published by:Hasaan Kandula
    First published: