నల్గొండలో ఘోరం.. భార్యాపిల్లలపై గునపంతో దాడి.. ఆపై ఆత్మహత్య

మధు అనే వ్యక్తి క్షణికావేశంలో తన భార్య అఖిల, కుమార్తె మిల్కీపై గడ్డపారతో దాడి చేశాడు. పట్టరాని కోపంతో ఊగిపోయి, విచక్షిణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అఖిల అక్కడికక్కడే చనిపోగా, కుమార్తె మిల్కీ తీవ్రంగా గాయపడింది.


Updated: January 29, 2020, 7:50 PM IST
నల్గొండలో ఘోరం.. భార్యాపిల్లలపై గునపంతో దాడి.. ఆపై ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేటి సమాజంలో మానవత్వం క్రమంగా కనుమరుగవుతోంది. చిన్నచిన్న గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో కట్టుకున్న బంధాన్ని, రక్త సంబంధాలనూ తెంచుకుంటున్నారు. సొంత కుటుంబ సభ్యులనే చంపి మృగాళ్లా మారుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో జరిగింది. మధు అనే వ్యక్తి క్షణికావేశంలో తన భార్య అఖిల, కుమార్తె మిల్కీపై గడ్డపారతో దాడి చేశాడు. పట్టరాని కోపంతో ఊగిపోయి, విచక్షిణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అఖిల అక్కడికక్కడే చనిపోగా, కుమార్తె మిల్కీ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక భార్య, కూతురిపై దాడిచేసిన మధు.. ఆపై ఉరివేసుకొని తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు