తల్లితో సహజీవనం.. సందు దొరికింది కదా అని ఆమె కూతురిని..

పెద్ద కూతురు ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతూ ఒంటరిగా ఉన్న తల్లితో కలిసి ఉంటుంది. అయితే ఆటో డ్రైవర్ సుభాని కన్ను ఇంట్లో ఉన్న మహిళ పెద్ద కూతురిపై పడింది.

news18-telugu
Updated: July 23, 2020, 2:20 PM IST
తల్లితో సహజీవనం.. సందు దొరికింది కదా అని ఆమె కూతురిని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రోజురోజూకీ మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. ఓ ఆటో డ్రైవర్ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతోనే సహజీవనం చేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ వ్యక్తి సహజీవనం చేస్తున్న మహిళ కూతురిపై కన్నేశాడు. అదును కోసం ఎదురుచూశాడు. సమయం చిక్కడంతో బాలికపై లైంగిక దాడి చేశాడు. అయితే ఈ ఘోరాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. సదరు వ్యక్తి చెంపలు వాయించి పోలీసు స్టేషన్‌లో అప్పగించాల్సింది పోయి.. తన కూతురును మభ్య పెట్టి వారిద్దరికి పెళ్లి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో బాలిక వారి నుంచి తప్పించుకుని అమ్మమ్మ ఇంటికి చేరింది. అనంతరం పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఒంగోలులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒంగోలులోని బెస్తవారిపేటకు చెందిన ఓ మహిళకు వివాహం అయ్యింది. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

భర్తతో మనస్పర్ధల కారణంగా భర్త నుంచి విడిపోయి ఏడు సంవత్సరాలుగా వేరుగా ఉంటోంది. స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో చిరుద్యోగిగా పనిచేస్తూ తన ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటుంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే బలరాం కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సుభానితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సహాజీవనానికి దారి తీసింది. అయితే తల్లి ప్రవర్తన నచ్చని చిన్న కూతురు అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. పెద్ద కూతురు ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతూ ఒంటరిగా ఉన్న తల్లితో కలిసి ఉంటుంది. అయితే ఆటో డ్రైవర్ సుభాని కన్ను ఇంట్లో ఉన్న మహిళ పెద్ద కూతురిపై పడింది. ఏలాగైనా ఆ బాలికను లొంగదీసుకోవాలని భావించాడు. అదును కోసం వేచి చూశాడు.

మంచి సమయం దొరకడంతో బాలికపై రెండుసార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. అయితే సుభానిని ఈ విషయమై నిలదీసి పోలీసులకు చెప్పాల్సింది పోయి.. తన కూతురికి నచ్చజెప్పడం ప్రారంభించింది. తన కూతురిని గోల చేయోద్దని.. ఇద్దరికి పెళ్లి చేస్తానంటూ చెప్పింది. తల్లితో సహాజీవనం చేస్తున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటంటూ బాలిక నీలదీసింది. దీంతో చంపేస్తానంటూ సుభాని బాలికను బెదిరించాడు. బాలిక అక్కడు నుంచి పారిపోయి అమ్మమ్మ ఇంటికి చేరుకుంది.

జరిగిన విషయమంతా అమ్మమ్మ ఇంటిలో చెప్పడంతో వారు ఒక్కసారిగా నిశ్చేష్ఠులయ్యారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు నిందితుడు సుభాని, బాలిక తల్లిపైన కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే.. అప్పటికే బాలిక తల్లి తన కూతురు కన్పించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించడం గమనార్హం.
Published by: Narsimha Badhini
First published: July 23, 2020, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading