హోమ్ /వార్తలు /క్రైమ్ /

పక్కింటి వ్యక్తితో భార్య రాసలీలలు..ఇంటికి పిలిపించుకొని మరీ..తట్టుకోలేక ఆ భర్త ఏం చేశాడంటే..

పక్కింటి వ్యక్తితో భార్య రాసలీలలు..ఇంటికి పిలిపించుకొని మరీ..తట్టుకోలేక ఆ భర్త ఏం చేశాడంటే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Uttar Pradesh: పిల్లలతో కలిసి అతడు టవర్‌పైకి ఎక్కాడు. తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. అందుకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు.

అది బిజీ రోడ్డు. వాహనాల రాకోపోకలు,  మనుషుల రద్దీతో  చాలా సందడిగా ఉంటుంది. అలాంటి చోట ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. తన పిల్లలతో కలిసి టవర్ ఎక్కాడు. 40 ఫీట్ల ఎత్తున ఆ టవర్ నుంచి పిల్లలను తోసేసి.. తానూ దూకేస్తానని చెప్పాడు. తన భార్య.. పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బెదిరించాడు. అతడు టవర్ ఎక్కుతుండగా కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? పోలీసులు ఏం చేశారు? అతడు పిల్లలతో కలిసి టవర్ మీది నుంచి దూకేశాడా? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

హైదరాబాద్​ డ్రగ్స్​ కేసులో మరో ట్విస్టు.. ఆ ఏడుగురితో పాటు మరో 15 మంది బడా వ్యాపారులు?

ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి అక్బర్ పూర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఐతే ఇటీవల తన భార్య గురించి అతడికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. పక్కింట్లో ఉండే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని.. తాను పని కోసం బయటకు వెళ్లినప్పుడు అతడు నేరుగా ఇంట్లోకే వస్తున్నాడని స్థానికుల ద్వారా తెలుసుకున్నాడు. వారు చెప్పేది నిజమో కాదో తెలుసుకునేందుకు.. ఓసారి కాపుగాసి మరీ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఇంకోసారి ఇలా చేయవద్దని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పులేదు. ఏం చేయాలో అర్ధం కాక.. చివరకు పోలీసులను కూడా ఆశ్రయించాడు. కానీ వారు లైట్ తీసుకున్నారని అతడు వాపోయాడు. ఈ క్రమంలోనే సోమవారం తన పిల్లలను తీసుకొని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ టవర్ వద్దకు వెళ్లాడు. పిల్లలతో కలిసి టవర్‌పైకి ఎక్కాడు. తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. అందుకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు.

Shocking:రాత్రి రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్న యువతి.. తర్వాతి రోజు ..

అక్కడున్న వారు ''వద్దు..కిందకు దిగండి'' అని కేకలువేశారు. ఐనా అతడు వినకపోవడంతో పోలీసులుకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకొని.. అతడికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు గంట హైడ్రామా తర్వాత.. పోలీసుల హామీ మేరకు అతడు కిందకు దిగాడు. గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఐనా న్యాయం జరగలేదని అతడు వాపోయాడు. ఈసారి ఎలాగైనా చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురినీ పిలిచి మాట్లాడారు. భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇప్పించారు. వారి మధ్య ఉన్న గొడవను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అక్బర్ పూర్ సర్కిల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ తెలిపారు. వీలైనంత త్వరలోనే చక్కదిద్దుతామని స్పష్టం చేశారు.

First published:

Tags: Crime news, Up news, Uttar pradesh

ఉత్తమ కథలు