హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG : ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని..భార్య చేయి నరికిన భర్త

OMG : ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని..భార్య చేయి నరికిన భర్త

భార్య చేయి నరికిన భర్త

భార్య చేయి నరికిన భర్త

Husband chops off wife hand : భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఏ భర్త అయినా ఎగిరి గంతేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం అందుకు విభిన్నంగా భార్య చేయిని నరికేశాడు ఓ కిరాతక భర్త.

Husband chops off wife hand : భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఏ భర్త అయినా ఎగిరి గంతేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం అందుకు విభిన్నంగా భార్య చేయిని నరికేశాడు ఓ కిరాతక భర్త. వెస్ట్ బెంగాల్(West Bengal) రాష్ట్రం​లోని తూర్పు బుర్ద్వాన్‌లోని కేతుగ్రామ్‌ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...షేర్​ మహమ్మద్(26), రేణు ఖాతున్​(23) భార్యాభర్తలు. 2017లో వీరి పెళ్లి జరిగింది. రేణు ఖాతున్, షేర్ మహమ్మద్​లకు చదువుకునేటప్పటి నుంచే పరిచయం ఉంది. దీంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాక 2017లో వీరి పెళ్లి జరిగింది. 2018లో కలకత్తాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీ (GNM)లో డిప్లొమా కోర్సును పూర్తి చేసింది రేణు ఖాతున్. ఆ తర్వాత, ఆమె దుర్గాపూర్‌లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్​లో నర్సింగ్(Nursing) శిక్షణ తీసుకుండేది. భర్త, అత్తమామల అభ్యంతరాల మధ్యే నర్సింగ్ శిక్షణ కొనసాగిస్తుండేది. చిన్న కిరాణా దుకాణం నడుపుతున్న ఆమె భర్త మరియు అత్తమామలు రేణు నిర్ణయాన్ని వ్యతిరేకించారని, ఆమెను పలుమార్లు చిత్రహింసలకు గురి చేశారని పోలీసులు తెలిపారు.

Shocking : మైనర్ బాలుడిపై కార్మికులు అరాచకం..మిక్సింగ్ మిషన్ కి కట్టేసి దారుణంగా..

అయితే ఈ మధ్యే ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో పాసై ప్రభుత్వ ఉద్యోగం(Government Job) సాధించింది రేణు ఖాతున్​. తనకు నర్సుగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఇటీవల రేణు తన భర్తకు తెలియజేసింది. దీంతో భార్య రేణు ఖాతున్​ ఉద్యోగం చేయడానికి భర్త షేర్​ మహమ్మద్ అంగీకరించలేదు. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడం వల్ల తనను విడిచిపెట్టి వెళ్లిపోతుందని భయపడ్డాడు షేర్ మహమ్మద్. ఆమెతో తగాదాలకు పాల్పడ్డాడు. ఉద్యోగం మానేయమన్నాడు. అత్తమామలు కూడా ఉద్యోగం మానేయాలని రేణుపై ఒత్తిడి తెచ్చారు. అయితే రేణు అందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున రేణు ఖాతున్ (23) నిద్రలో ఉండగా షేర్ మహమ్మద్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కొడవలితో ఆమె కుడి చేతిని నరికాడు.

Pet dog : విశ్వాసం అంటే ఇదే మరి..యజమానిని రక్షించి ప్రాణాలు కోల్పోయిన కుక్క


దీంతో రక్తపు మడుగులో ఉన్న రేణుని దుర్గాపుర్​(Durgapur)లోని ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె చేయిని తొలగించి వైద్యం చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. రేణు తండ్రి అజీజుల్ హక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహిళ తండ్రి నుంచి ఫిర్యాదు అందుకొని హత్యాయత్నం కేసు నమోదు చేశాం. మహిళ భర్త, అతని స్నేహితులు సహా నిందితులందరూ పరారీలో ఉన్నారు. వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తూర్పు బుర్ద్వాన్‌లోని కత్వాలో అదనపు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ధృబా దాస్‌ తెలిపారు.

First published:

Tags: Crime news, Husband, West Bengal, Wife

ఉత్తమ కథలు