అత్తపై అల్లుడి పైశాచికత్వం.. మీద పడి ఎంత దారుణం చేశాడంటే..

పెళ్లి సమయంలో రూ.10లక్షలు కట్నం కింద ఇచ్చారు. కొన్నాళ్లు సాఫీగానే సాగిన కాపురంలో అదనపు కట్నం చిచ్చు మొదలైంది. మరో రూ.5లక్షలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు.

news18-telugu
Updated: August 27, 2019, 8:35 AM IST
అత్తపై అల్లుడి పైశాచికత్వం.. మీద పడి ఎంత దారుణం చేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఓ అల్లుడు అత్త ముక్కను కొరికేశాడు. అంతేకాదు, అతని తండ్రి కూడా ఆమెపై దాడి చేసి చెవిని కోసేశాడు.ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..బరేలీకి చెందిన చాంద్‌బీ అనే యువతికి ఏడాది క్రితం మహమ్మద్ అష్వక్ అనే వ్యక్తితో పెళ్లయింది. పెళ్లి సమయంలో రూ.10లక్షలు కట్నం కింద ఇచ్చారు. కొన్నాళ్లు సాఫీగానే సాగిన కాపురంలో అదనపు కట్నం చిచ్చు మొదలైంది. మరో రూ.5లక్షలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు.

ఈ నేపథ్యంలో అల్లుడితో మాట్లాడేందుకు చాంద్‌బీ తండ్రి భార్య గుల్షన్‌ను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లాడు.అదనపు కట్నంపై అల్లుడిని అత్త,మామలు మందలిస్తున్న తరుణంలో అతను తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు. పట్టరాని కోపంతో అత్త మీద పడి ముక్కను కొరికేశాడు. ఇంతలోనే అతని తండ్రి ఇజార్ గుల్షన్‌పై దాడి చేసి చెవిని కోసేశాడు. ఆపై అక్కడినుంచి పరారయ్యారు.
రక్తస్రావంతో గుల్షన్ స్ప‌ృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

First published: August 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు