డేటింగ్ సైట్‌లో భర్తను కోల్పోయిన మహిళతో పరిచయం.. డైరెక్టర్‌ని చేస్తానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి..

ప్రతీకాత్మక చిత్రం(Image-Youtube)

ఆన్‌లైన్ డేటింగ్ సైట్‌లో భర్తను కోల్పోయిన మహిళతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తనకు బెంగళూరులో సంస్థలు ఉన్నాయని అందులో డైరెక్టర్‌గా నియమిస్తానని చెప్పి ట్రాప్ చేశాడు.

 • Share this:
  భర్తను కోల్పోయిన మహిళకు మాయమాటలు చెప్పిన ఓ వ్యక్తి.. ఆమె వద్ద నుంచి రూ. 3 లక్షలు కొల్లగొట్టాడు. డేటింగ్ సైట్‌లో పరిచయం అయిన ఆమెను పెళ్లి చేసుకుంటానని, తన కంపెనీలో డీలర్‌షిప్ ఇప్పిస్తానని చెప్పి మాయమాటలతో బురిడి కొట్టించాడు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడు రాజవన్స్‌ను హైదరాబాద్ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. బెంగళూరులోని చంద్రపురాకు చెందిన కుమార్‌ రాజ్‌వంశ్‌(49) మేనేజ్‌మెంట్‌ స్టడీ పూర్తిచేశాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. ఆ తర్వాత మైనింగ్‌తో పాటు టీకప్‌ల తయారీ పరిశ్రమను నిర్వహించాడు. అయితే వాటిలో తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో నష్టాలను పూడ్చుకుని.. సులువుగా డబ్బు సంపాదించాలని అడ్డదారి తొక్కాడు. అమాయకులను మోసగించి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు.

  ఇందులో భాగంగా ఓ ఆన్‌లైన్ డేటింగ్ సైట్‌లో అతడి వివరాలు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 2019 మార్చిలో ఓ భర్తను కొల్పోయిన మహిళ.. రాజ్‌వంశ్‌తో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలోనే ఆ మహిళను రాజ్‌వంశ్ తన మాయమాటలతో నమ్మించాడు. తాను కూడా విడాకులు తీసుకున్నాని.. బెంగళూరులో బాగా లాభాలు చేకూర్చే హౌస్‌ కీపింగ్‌ సంస్థను నిర్వహిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. తన కంపెనీలో లర్‌షిప్, డైరెక్టర్‌షిప్‌తో పాటు మీ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.

  అయితే అతని మాటలు నమ్మిన బాధిత మహిళ పూర్తిగా ట్రాప్‌లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలోనే బిజినెస్ విస్తరణ కోసం డబ్బులు అవసరమని చెపపడంతో.. ఆ మహిళ దశల వారీగా రూ. 3 లక్షలను రాజ్‌వంశ్ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే ఆ తర్వాత రాజ్‌వంశ్ స్పందించడం మానేశాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆ మహిళ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతికత ఆధారంగా నిందితుడు రాజ్‌వంశ్ బెంగళూరులో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్‌వారంట్‌పై నగరానికి తీసుకొచ్చి చర్లపల్లి జైలుకు తరలించారు.
  Published by:Sumanth Kanukula
  First published: