ప్రేమ పేరుతో యువతిని గదిలోకి తీసుకెళ్లి శృంగారం చేసి...గర్బవతి అని తెలియగానే...దారుణం...

సరిగ్గా మూడు నెలల క్రితం సోనీని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను తన లైంగిక వాంఛ తీర్చమని ఫోర్స్ చేశాడు. అందుకు ఆ బాలిక ససేమిరా అన్నది. పెళ్లి చేసుకున్న తర్వాతే అని తేల్చి చెప్పింది. అయినా సోమేష్ ఒప్పుకోలేదు.

news18-telugu
Updated: October 25, 2020, 10:45 PM IST
ప్రేమ పేరుతో యువతిని గదిలోకి తీసుకెళ్లి శృంగారం చేసి...గర్బవతి అని తెలియగానే...దారుణం...
సరిగ్గా మూడు నెలల క్రితం సోనీని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను తన లైంగిక వాంఛ తీర్చమని ఫోర్స్ చేశాడు. అందుకు ఆ బాలిక ససేమిరా అన్నది. పెళ్లి చేసుకున్న తర్వాతే అని తేల్చి చెప్పింది. అయినా సోమేష్ ఒప్పుకోలేదు.
  • Share this:
ప్రేమ పేరుతో ప్రియుడి చేతిలో యువతి దారుణంగా మోసపోయింది. అతడి మాయమాటలకు వంచనకు గురై ఆ మైనర్‌ బాలిక గర్భం దాల్చింది. చివరకు ఆ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక తండాకు చెందిన సోనీ ( పేరు మర్చాం) అనే యువతి 10వ తరగతి పాస్ అయ్యింది. చదువుల్లో చురుగ్గా ఉండే ఆ యువతి కాలేజీలో చేరి తన కలలను నెరవేర్చుకోవాలనుకుంది. అప్పుడే ఆమె జీవితంలోకి సోమేష్ అనే యువకుడు ప్రవేశించాడు. సోమేష్ వృత్తిరీత్యా రాయచూరులో ఓ మెడికల్ షాపులో పనిచేసేవాడు. సోని ఉండే గ్రామంలో ఓ సారి పెళ్లికి అతిథిలా హాజరయ్యాడు. అక్కడే సోని అతడి దృష్టిలో పడింది. వెంటనే సోని స్నేహితుల ద్వారా ఆమె ఫోన్ నెంబర్ కనుక్కున్నాడు. తరచూ ఫోన్ చేసేవాడు. ప్రేమిస్తున్నానని, ప్రాణం ఇస్తాను అంటూ ఆమె వెంటపడ్డాడు. చివరకు సోని అతడి మయమాటలకు మోసపోయింది. అతడి ప్రేమకు అంగీకరించింది. రెండు నెలల పాటు ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. సరిగ్గా మూడు నెలల క్రితం సోనీని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను తన లైంగిక వాంఛ తీర్చమని ఫోర్స్ చేశాడు. అందుకు ఆ బాలిక ససేమిరా అన్నది. పెళ్లి చేసుకున్న తర్వాతే అని తేల్చి చెప్పింది. అయినా సోమేష్ ఒప్పుకోలేదు. ఎలాగైనా తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. చివరకు సోనీ సరేఅని ఒప్పుకుంది. సోమేష్ పశువాంఛకు సోని బలిపశువు అయ్యింది. అప్పటి నుంచి సోమేష్ అడ్రస్ లేకుండా పోయాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు. దీంతో బాలిక గర్భవతి అయ్యింది.

ఓ సారి సోమేష్ కనబడితే నిలదీయగా, తనకు ఆమె గర్భానికి ఎలాంటి సంబంధం లేదని మొహం చాటేశాడు. దీంతో సోనీ మోసపోయానని భోరుమన్నది. అయితే బాలిక గర్భం విషయంలో ఇంట్లో తెలిసింది. దీంతో సొంత వైద్యం చేసి అబార్షన్‌ చేసేందుకు ఆమె తల్లి నాటు వైద్యుడితో కలిసి యత్నించింది. అయితే నాటు వైద్యం వికటించి బాలిక ప్రాణాపాయానికి చేరుకుంది. కాగా బాలిక పరిస్థితిని గమనించిన స్థానిక మహిళా నేత ఒకరు ఆసుపత్రిలో చేర్పించారు. బాలికను విషయం తెలుసుకున్న పోలీసులు... రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోంది.
Published by: Krishna Adithya
First published: October 25, 2020, 10:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading