హనీమూన్ లో షాక్... ఒకే హోటల్‌లో భార్య, ప్రియురాలితో రాసలీలలు...షాకింగ్...

ఒకే హోటల్లో వేర్వేరు గదుల్లో అటు భార్యను, ప్రియురాలు ఇద్దరినీ ఉంచాడు. కొత్తగా వివాహం అయిన కుంజుమోహన్ కాసేపు భార్యతోనూ, ఆ తర్వాత భార్యను హోటల్ గదిలోనే ఉంచి ప్రియురాలిని తీసుకుని విహారం చేసి వచ్చేవాడు.

news18-telugu
Updated: July 11, 2020, 4:18 PM IST
హనీమూన్ లో షాక్... ఒకే హోటల్‌లో భార్య, ప్రియురాలితో రాసలీలలు...షాకింగ్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు ఇలాంటి ఘటనలను సినిమాల్లోనే చూస్తుంటాము. కానీ ఓ ప్రబుద్ధుడు, పెళ్లియినా ప్రియురాలిని వదల్లేదు. అటు భార్యను, ప్రియురాలిని మోసం చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇంకేముందు ఇద్దరినీ ఒకే చోటికి హనీమూన్ కు తీసుకెళ్లడంతో అసలు సంగతి బయటపడింది. వివరాల్లోకి వెళితే...కేరళకు చెందిన కుంజుమోహన్ (పేరు మార్పు) తాజాగా తన భార్యను హనీమూన్ కోసమని మున్నార్ అనే హిల్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. అయితే అంతకుముందే తన ప్రియురాలిని మున్నార్‌లోని తాను బసచేయనున్న హోటల్ కు పంపించాడు.

ఒకే హోటల్లో వేర్వేరు గదుల్లో అటు భార్యను, ప్రియురాలు ఇద్దరినీ ఉంచాడు. కొత్తగా వివాహం అయిన కుంజుమోహన్ కాసేపు భార్యతోనూ, ఆ తర్వాత భార్యను హోటల్ గదిలోనే ఉంచి ప్రియురాలిని తీసుకుని విహారం చేసి వచ్చేవాడు. అయితే అటు హోటల్ మేనేజ్ మెంట్ కూడా అతడికి సహకరించడంతో కుంజుమోహన్ కు అన్నీ కలిసి వచ్చాయి. వారం రోజుల హనీమూన్ తర్వాత కొచ్చిన్ లోని వారి ఇళ్లకు ముగ్గురు చేరిపోయారు.

అయితే వారం తర్వాత కుంజుమోహన్ బార్యతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు, తర్వాత ఓరోజు భార్య అతని మొబైల్ ఫోన్ చెక్ చేసింది. చివరకు కుంజుమోహన్ తన ప్రియురాలితో కలిసి దిగిన సెల్ఫీలు చూసి అవాక్కయ్యింది. ఆ ఫొటోలు సైతం మున్నార్ లో తాము బసచేసిన హోటల్ లోవే కావడం. అలాగే కుంజుమోహన్ వేసుకున్న దుస్తులు కూడా సేమ్ గా ఉండటంతో, ఫోటోలు చూసి షాక్ తిన్నది.. పైగా డేట్స్ చూస్తే ఆరోజు ఆమె మున్నార్ లో ఉన్న రోజులవే కావడంతో ఆమె దీంతో భర్తని నిలదీసింది. దీంతో ఆమెని బెదిరించి చితకబాదాడు. బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. కానీ కుంజుమోహన్ బార్య చివరకు పోలీసులకు తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.
Published by: Krishna Adithya
First published: July 11, 2020, 4:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading