విద్యార్థినితో ప్రొఫెసర్ రాసలీలలు...పెళ్లి పేరు ఎత్తగానే...

ప్రేమ, పెళ్లి అంటూ తనను నమ్మించి, తనతో శారీరకంగా బంధం పెట్టుకొని, ఇప్పుడు మోసం చేశారని ప్రొఫెసర్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

news18-telugu
Updated: August 11, 2020, 9:48 PM IST
విద్యార్థినితో ప్రొఫెసర్ రాసలీలలు...పెళ్లి పేరు ఎత్తగానే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మన దేశంలో మహిళపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్ తన విద్యార్థినితో లైంగిక కోరికలు తీర్చుకునేందుకు తెగబడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జాదవ్‌పూర్‌లో జరిగింది. జాదవ్‌పూర్ యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని తనకు వర్శిటీలోని ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ, పెళ్లి అంటూ తనను నమ్మించి, తనతో శారీరకంగా బంధం పెట్టుకొని, ఇప్పుడు మోసం చేశారని ప్రొఫెసర్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్టేట్‌మెంట్ ప్రకారం ఆ యువతికీ ప్రొఫెసర్‌ మధ్య 2018 మధ్య నుంచి 2020 మార్చి వరకూ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ కొనసాగిందని చెప్పుకొచ్చింది. ఆ ప్రొఫెసర్ చాలాసార్లు తనను రేప్ చేశారని బాధితురాలు తెలిపింది. ప్రతిసారీ త్వరలోనే మన పెళ్లి అంటూ తనను మోసం చేశాడని తెలిపింది. ఈ సంవత్సరం మార్చి తర్వాత ఆ ప్రొఫెసర్, తనను దూరం పెట్టడం మొదలు పెట్టాడని, ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకొని ఇంటరాగేట్ చేస్తామని, ఆరోపణలు నిజమని తేలితే చట్టపరంగా ముందుకెళ్తామని పోలీసులు తెలిపారు.
Published by: Krishna Adithya
First published: August 11, 2020, 9:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading