యువతికి మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం...వీడియో తీసి దారుణం...

మహేష్‌ ఆ యువతి పనిచేస్తున్న వస్త్రాల దుకాణం వద్దకు వచ్చి మీ అమ్మకు ఆరోగ్యం బాలేదు..పదా వెళ్దాం అంటూ తన ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లాడు. సాయంత్రం 7 గంటల సమయంలో నిర్మానుష్య ప్రాంతంలో లైంగికదాడి చేశాడు.

news18-telugu
Updated: October 27, 2020, 10:51 PM IST
యువతికి మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం...వీడియో తీసి దారుణం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
యువతికి మాయమాటలు చెప్పిన ఓ యువకుడు బలవంతంగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈఘటన బీహార్ లోని చాప్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే చాప్రాకు చెందిన బాధిత యువతి కుటుంబం మూడేళ్ల క్రితం కిషన్ గంజ్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆమె అదే పట్టణంలో ఓ దుస్తుల షాపులో పనిచేసేది. ఆ సమయంలో ఇంటి పక్కన ఉండే సోమేష్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో నివాసం ఉండే మహేష్‌ను పరిచయం చేశాడు. యువతి ఫోన్‌ నెంబర్‌ సంపాదించిన మహేష్‌ గత మూడు నెలలుగా నుంచి ఆమెతో స్నేహంగా ఉంటూ తరచుగా ఫోన్‌లో మాట్లాడేవాడు. కొద్ది రోజుల నుంచి తనను ప్రేమించాలని మహేష్‌ వేధిస్తున్నాడు.

గతవారం మహేష్‌ ఆ యువతి పనిచేస్తున్న వస్త్రాల దుకాణం వద్దకు వచ్చి మీ అమ్మకు ఆరోగ్యం బాలేదు..పదా వెళ్దాం అంటూ తన ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లాడు. సాయంత్రం 7 గంటల సమయంలో నిర్మానుష్య ప్రాంతంలో లైంగికదాడి చేశాడు. అనంతరం వీడియో తీసి తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు. మరోసారి తనతో రావాలని లేకుంటే వీడియోలు లీక్ చేస్తానని మహేష్ తన ఇంటికి తీసుకెళ్లి మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ప్రయత్నాన్ని అడ్డుకున్న కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Published by: Krishna Adithya
First published: October 27, 2020, 10:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading