TTD: తిరుప‌తి ద‌ర్శనం పేరుతో బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు లూటీ...

ప్రతీకాత్మక చిత్రం

శ్రీవారి దర్శనం పేరుతో హైదరాబాద్ కి చెందిన ఓ వ్యక్తిని మోసం చేశారు ఆన్ లైన్ ముఠా. 15 వేలు కడితే శ్రీవారి దర్శనం పేరుతో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్న తరువాత పత్తా లేకుండా పోయారు.

  • Share this:
    తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనం అంటేనే భక్తులు పరితపించి పోతారు. నిత్యం వేల  సంఖ్యలో స్వామి వారి సన్నిధికి చేరుకొని శ్రీశ్రీనివాసుని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటారు. స్వామి వారి విఐపి బ్రేక్ దర్శనానికి ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు. స్వామి వారిని దగ్గరగా దర్శనం చేసుకొనే భాగ్యం సేవలు తరువాత ఒక్క విఐపి బ్రేక్ దర్శనానికి మాత్రమే ఉంది. అందుకే విఐపి బ్రేక్ దర్శనానికి ఇంత డిమాండ్ ఉంటుంది.   భక్తుల కొరికనే ఆసరాగా తీసుకోని కొందరు దళారీలు వారి వ్యాపారాన్ని కొనసాగిస్తుంటే....మరి కొందరు దర్శన పేరుతో భక్తులను మోసం చేసి అధిక వస్సులకు పాల్పడి భక్తుల నెత్తిపై కుచ్చుటోపీ పెడుతున్నారు. తాజాగా భక్తులు టీటీడీ విజిలెన్స్ కు పిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన మధుసూదన్ అనే భక్తుడి పిర్యాదు మేరకు విచారణ నిమిత్తం కేసును టీటీడీ విజిలెన్స్ తిరుమల పోలీసులకు అప్పగించింది.

    శ్రీవారి దర్శనం కోసం హైదరాబాద్ కు చెందిన మధుసూదన్ అనే భక్తుడు రాంభూపాల్ అనే దళారిని ఆశ్రయించాడు. 15000వేలు ముందుగా చెలిస్తే దర్శనం ఖాయమని దళారీ మధుసూదన్ కు తెలిపాడు. వెంటనే తన బ్యాంకు ఖాతానుంచి 15 వేల రూపాయల నగదు రాంభూపాల్ కు చెల్లించాడు. తీరా దర్శనం కోసం సంప్రదిస్తే దళారీ రాంభూపాల్ టిక్కెట్ల విషయం ఎత్తకపోగా మధుసూదన్ ను దుర్భాషలాడినట్ల తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే భక్తుడు విజిలెన్స్ సిబ్బందికి నేరుగా వచ్చి పిర్యాదు చేశాడా....లేక నేరుగా వచ్చి పిర్యాదు చేశాడనే విషయం తెలియాల్సి ఉంది.

    నిందితుడు రాంభూపాల్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బ్యాంక్ అకౌంట్ ద్వారా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు రాంభూపాల్ బ్యాంకు ఖాతా అనంతపూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం దళారీ పరారీలో ఉన్నట్లు...మొబైల్ కూడా స్విచ్ అఫ్ చేసినట్లు తెలుస్తోంది.
    Published by:Balakrishna Medabayani
    First published: