నెల్లూరులో ఘరానా మోసగాడు... మంత్రి పీఏ అంటూ...

మంత్రి గౌతమ్ రెడ్డి పీఏ అంటూ మోసాలకు పాల్పడిన వ్యక్తిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: November 28, 2019, 12:18 PM IST
నెల్లూరులో ఘరానా మోసగాడు... మంత్రి పీఏ అంటూ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మంత్రి పీఏ అని చెప్పుకుని మోసాలకు పాల్పడిన ఓ వ్యక్తిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పీఏని అని... రాష్ట్రంలో ఏ పని అయినా చిటికెలో చేసి పెడతానని కొన్ని నెలలుగా అమాయకులను నమ్మించి మోసం చేశాడు గుండా వంశీకృష్ణరెడ్డి. తన కారు నంబర్ ప్లేట్‌కు వైసీపీ అని రాసుకోవడంతో... ఈ మోసగాడిని బాధితులు కూడా నమ్మారు. అతడికి లక్షల్లో సొమ్మును ముట్టజెప్పి... తమ పని చేసి పెట్టాలని కోరారు. అయితే అతడు మోసగాడు అనే విషయం బాధితులకు ఆలస్యంగా అర్థమైంది. విషయం మంత్రి పీఏ అయిన మనోహర్ రెడ్డికి తెలియడంతో... దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు... బాధితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా... అతడు ఐదు నెలల్లోనూ ఈ రకంగా చెప్పుకుని కోటి రూపాయలకు పైగా వసూలు చేశాడని తేలింది. అంతేకాదు నెల్లూరు జిల్లాతో పాటు హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. గతంలో ఓ వ్యక్తిని వంశీకృష్ణరెడ్డి హత్య చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. నిందితుడు నుంచి ఓ స్కోడా కారుతో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఇలాంటి వారి చేతిలో మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>