హోమ్ /వార్తలు /క్రైమ్ /

సీఎం జగన్ భార్య భారతి పీఏ పేరుతో మోసాలు

సీఎం జగన్ భార్య భారతి పీఏ పేరుతో మోసాలు

సీఎం జగన్ భార్య భారతి(ఫైల్ ఫోటో)

సీఎం జగన్ భార్య భారతి(ఫైల్ ఫోటో)

సీఎం జగన్ భార్య వైఎస్ భారతికి పీఏను అంటూ ఓ నిరుద్యోగిని మోసం కేటుగాడు.

    పెద్దవాళ్లకు పీఏ అంటూ నిరుద్యోగులను మోసం చేసే కేటుగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా ఓ కేటుగాడు ఏకంగా సీఎం జగన్ భార్య వైఎస్ భారతికి పీఏను అంటూ ఓ నిరుద్యోగిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాను సీఎం జగన్ భార్య వైఎస్ భారతికి పీఏ అంటూ నిరుద్యోగిని సత్యశ్రీరాం అనే మోసగాడు నమ్మించాడు. అతడికి పంచాయతీరాజ్ లేదా సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని తెలిపాడు. ఇందుకోసం కొంత ఖర్చవుతుందని తెలిపాడు. సత్యశ్రీరాం మాటలను అతడు ఆన్‌లైన్‌లో రూ. లక్షకు పైగా బాధితుడి ఖాతాలో వేశాడు. మరో బాధితుడు అఖిల్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతో నిందితుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఎంతకూ సత్యశ్రీరాం నుంచి స్పందన లేకపోవడంతో... అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు అఖిల్. రంగంలోకి దిగిన పోలీసులు... ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ys bharathi

    ఉత్తమ కథలు