• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN CHEATED A FORMER ON THE NAME OF INSURANCE TO DEAD BULLS AND GRABS RS 5 LAKSH AS COMMISSION IN EAST GODAWARI DISTRICT OF ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: ఎద్దులకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తానంటూ ఫోన్.. మోసగాడి మాటలు నమ్మిన రైతు.. తర్వాత ఏం జరిగిందంటే..

Andhra Pradesh: ఎద్దులకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తానంటూ ఫోన్.. మోసగాడి మాటలు నమ్మిన రైతు.. తర్వాత ఏం జరిగిందంటే..

మోసపోయిన రైతు సత్యేంద్ర (ఫైల్)

Cyber Crime: పెంచుకున్న ఎడ్లు చనిపోవడంతో తీవ్ర ఆవేదనతో ఉన్న రైతును ఓ కేటుగాడు నిలువునా ముంచేశాడు. సామర్లకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • Share this:
    అతడో రైతు. పొలాలు, పశువులే అతడి ప్రాణం. అంతేకాదు ఎడ్ల పందేలంటే పిచ్చి. అందుకోసమే మేలుజాతి ఎద్దులను ప్రత్యేకంగా పోషిస్తూ వాటిని పందేలకు తీసుకెళ్తాడు. రైతు నమ్మకాన్ని వమ్ముచేయని బసవన్నలు రాష్ట్రస్థాయి బహమతులు గెలిచి రైతుకు మంచిపేరు తీసుకొచ్చాయి. ఐతే రైతు విజయాన్ని చూసి ఓర్వలేని కొందరు అసూయపరులు వాటికి విషమిచ్చి చంపేశారు. దీంతో రైతు కుప్పకూలిపోయాడు. అసలే పెంచుకున్న ఎడ్లు చనిపోవడంతో తీవ్ర ఆవేదనతో ఉన్న రైతును ఓ కేటుగాడు నిలువునా ముంచేశాడు. చనిపోయిన ఎడ్లకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తానంటూ రూ.5లక్షలు కాజేశాడు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని పెద్దనుయ్యి వీధికి చెందిన వల్లూరి సత్యేంద్ర కుమార్ కు చెందిన నాలుగు ఎడ్లు జనవరి 29న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. పందెంలో గెలిచిన కొన్ని గంటలకే గుర్తుతెలియని వ్యక్తులు వాటికి విషమిచ్చి చంపేశారు.

    ఈ ఘటనపై సత్యేంద్ర కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎద్దుల నుంచి శాంపిల్స్ సేకరించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సత్యేంద్రకు ఈనెల 2న ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను ఇంటెలిజెన్స్ డీఎస్పీనని.. చనిపోయిన ఎడ్లకు రూ.45 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందని నమ్మించాడు. దానికి సంబంధించిన ప్రక్రియంతా తానే చేస్తానని.. ఇందుకోసం తనకు కొంత డబ్బు ఇస్తే పనైపోతుందన్నారు.

    ఇది చదవండి: అత్తారింటికి బురఖాలో వచ్చిన అల్లుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!



    అతడి మాయలో పడిన రైతు సత్యేంద్ర ఎస్బీఐ, సిటీ యూనియన్ బ్యాంకలకు చెందిన ఎకౌంట్లలో మొత్తం 13 విడతల్లో రూ.4.99 లక్షలు జమ చేశాడు. ఐతే డబ్బులు వేసి 10 రోజులు గడచినా అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని సత్యేంద్ర గ్రహించాడు.తనకు జరిగిన అన్యాయం గురించి స్నేహితుల వద్ద గోడు వెళ్లబోసుకోవడంతో ఆ విషయం పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు సత్యేంద్రతో మాట్లాడి కేసు నమోదు చేసుకున్నారు.  ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

    రైతు సత్యేంద్రకు టోకరా వేసిన  వ్యక్తి అంతర్రాష్ట్ర మోసగాడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అజ్ఞాతవ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ నెంబర్, అతడు ఇచ్చిన ఎకౌంట్ల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ ఎకౌంట్లు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు ప్రాధమికంగా గుర్తించారు. బ్యాంకు అధికారులను సంప్రదించి ఎకౌంట్లను ఫ్రీజ్ చేసేందుకు యత్నిస్తున్నారు. ఎకౌంట్ ఎరిది.. దీనికి లింక్ అయి ఉన్న ఆధార్, పోన్ నెంబర్ల వివరాలపై ఆరా తీస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: