బస్సులో పోర్న్ వీడియోలు చూస్తూ... హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడం మరిచిపోవడంతో...

బ్రిటన్‌లో మహిళకు వింత అనుభవం... బస్సులో పబ్లిక్‌గా అలాంటి వీడియోలు చూస్తున్న వ్యక్తిని హెచ్చరిద్దామని అనుకుని...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 6, 2019, 1:42 PM IST
బస్సులో పోర్న్ వీడియోలు చూస్తూ... హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడం మరిచిపోవడంతో...
అమెరికన్ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే 15 నుంచి 30 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు.
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 6, 2019, 1:42 PM IST
పోర్న్ వీడియోలు చూడడం చాలామందికి అలవాటు. ఆ వీడియోలు చూడకపోతే ఉండలేని పోర్న్ వ్యసనపరులు కూడా ఉంటారు. అయితే ఎక్కడ బడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు ఆ వీడియోలు చూస్తేనే... చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాాగా బ్రిటన్‌లోని ఎసెక్స్‌లో ఓ వ్యక్తి... ఇలా పబ్లిక్ బస్సులో పాడు వీడియోలు చూసి అందరినీ ఇబ్బందులకు గురిచేశాడో యువకుడు. బ్రిటన్‌లోని ఓ నగల షాపులో పనిచేస్తున్న ఓ మహిళ... శనివారం సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరింది. బస్సు ఎక్కి, సీటులో కూర్చుంది. శనివారం వీకెండ్ టైమ్ కావడంతో బస్సు చాలా ఖాళీగా ఉంది. డ్రైవర్‌తో కలుపుకుని కేవలం ఐదుగురే ఉన్నారు. సరే అనుకుని... బయటికి చూసి ఏదో ఆలోచనలో పడింది. కొద్దిసేపటికి ఆమెకు కొన్ని వింత శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలను విన్న వెంటనే ఆమెలో కంగారు మొదలైంది. మొబైల్‌లో పోర్న్ వీడియోలు వీడియోలు చూస్తున్న ఓ యువకుడు... హెడ్‌ఫోన్స్ సరిగ్గా పెట్టుకోలేదు. హెడ్‌ఫోన్స్ లైట్‌గా పెట్టి, పూర్తిగా బిగించడం మరిచిపోయి, పోర్న్ ప్రపంచంలో మునిగిపోయాడు.

దాంతో ఆ శబ్దాలు బయటికి పెద్దగా వినిపించడం మొదలెట్టాయి. బస్సులో ఉన్న మిగిలిన వారు మగవాళ్లే కావడంతో వారు ఎవ్వరూ అతన్ని ఏమీ అనలేదు. శబ్దాలను బట్టి అప్పుడప్పుడూ అతని మొబైల్‌వైపు తొంగి చూస్తున్నారు కూడా. అయితే బస్సు ఎక్కిన సదరు మహిళ మాత్రం ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది. బస్సులో పబ్లిక్‌గా అలాంటి వీడియోలు చూస్తున్న వ్యక్తిని హెచ్చరిద్దామని అనుకుంది. కానీ అందరూ మగాళ్లు ఉన్న సమయంలో ఎదురిస్తే, తనకు ఎవ్వరూ సపోర్ట్ వస్తారనేది? ఆమెకు అనుమానం కలిగింది. అతన్ని హెచ్చరిస్తూ ఇంకేమైనా చేసినా చేయొచ్చు. అప్పుడు కూడా మిగిలినవాళ్లు ఇలా చూస్తూ ఊరుకోవచ్చు... ఇలా ఆమె ఆలోచనలు సాగి... సైలెంట్‌గా భయపడుతూ కూర్చుండిపోయింది. తన స్టాప్ రాగానే బస్సు దిగి వెళ్లిపోయింది. బస్సు దిగిన తర్వాత సదరు యువకుడి ఫోటో తీసి, ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


First published: May 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...