news18
Updated: November 23, 2020, 11:12 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 23, 2020, 11:12 PM IST
వాళ్లిద్దరికీ సోషల్ మీడియాలో పరిచయమైంది. ఇద్దరూ భాగానే మాట్లాడుకున్నారు. ఇద్దరికీ చనువు ఏర్పడింది. ఆమె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా.. అతడిది డిగ్రీ అయిపోయింది. ఖాళీగానే ఉంటున్నాడు. దీంతో సోషల్ మీడియాలో అమ్మాయిలకు వలేయడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో కోల్కతా లోని గోవిందపూర్ కాలనీలో ఉంటున్న ఒక బాలిక (16)తో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఫోన్ లో మాట్లాడుకోవడం... ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోవడం అయింది. కొద్దిరోజుల క్రితం సదరు నిందితుడు.. తనకు అర్జెంటు అవసరం ఉందని.. ఆమె దగ్గర రూ. 4 వేలు అప్పుగా తీసుకున్నాడు. అవి తీర్చమని అడగ్గా.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
గోవిందపూర్ కు చెందిన 16 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్దిరోజుల క్రితం ఆమెకు సోషల్ మీడియాలో పరిచయమైన ఆ వ్యక్తి.. ఆమెతో ప్రేమగా మాట్లాడాడు. తాను మంచివాడినని నమ్మించాడు. చివరికి కొద్ది రోజుల తర్వాత.. తనకు అర్జెంటుగా అవసరం ఉందని.. ఆమె దగ్గర రూ. 4 వేలు అప్పుగా తీసుకున్నాడు. వాటిని వెంటనే తీరుస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఆమె ఎంత అడిగినా డబ్బులు ఇవ్వలేదు. ఆ బాలిక.. గట్టిగా అడిగింది. డబ్బులివ్వకుంటే ఈ విషయం ఇంట్లో చెబుతానని బెదిరించింది.
దీంతో.. బెదిరినట్టు నటించిన సదరు నిందితుడు.. ఆమెను ఇంటికి రమ్మని పిలిచాడు. డబ్బులిస్తానని నమ్మించాడు. అది నమ్మి ఆ బాలిక.. నిందితుడి ఇంటికెళ్లింది. ఆ సమయంలో అతడింటిలో ఎవరూ లేరు. ఇదే అదునుగా భావించిన నిందితుడు.. బాధితురాలిని రేప్ చేశాడు. ఆమె ఎంత విదిలించుకున్నా.. విడవకుండా.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేగాక ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరించాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని నంటూగా గుర్తించారు. అతడిపై గతంలోనూ వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసులు నమోదైనట్టు తెలుస్తున్నది. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.
Published by:
Srinivas Munigala
First published:
November 23, 2020, 11:12 PM IST