MAN BURIED MOTHERS DEADBODY IN DRUM AND COVERED WITH CONCRETE SHOCKING CRIME STORY FROM CHENNAI SK
OMG: ఇంట్లో ఖాళీ ప్లాస్టిక్ డ్రమ్ము.. కాంక్రీట్‌తో కప్పేసి ఉంది.. తెరిచి చేస్తే ఘోరం..
ప్లాస్టిక్ డ్రమ్ములో మృతదేహం
పోలీసులు సురేష్ ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేశారు. ఆ తర్వాత ప్లాస్టిక్ డ్రమ్ములోనే షెన్బగం మృతదేహం ఉందని తెలియడంతో షాక్ తిన్నారు. డ్రమ్మును పగులకొట్టి చూస్తే.. నిజంగానే అందులో డెడ్ బాడీ బయటపడింది.
ఆ ఇంట్లో ఓ ప్లాస్టిక్ డ్రమ్ము ఉంది. కొన్ని రోజులగా మూలకు పడిఉంది. వినియోగంలో లేదు. పైగా కాంక్రీట్‌తో కప్పేసి ఉంది. ఐతే అదే సమయంలో తల్లి కనిపించడం లేదు. చిన్న కొడుకు ఉంటున్న వృద్ధురాలు అదృశ్యమైంది. పెద్ద కొడుకు అనుమానం వచ్చింది. తమ్ముడి ఇంటికి వచ్చి ఆరా తీస్తే.. అతడి నుంచి పొంతన లేని సమాధానం వచ్చింది. ఏదో తేడా ఉందని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడి ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. ఎక్కడా ఏమీ అనుమానాస్పదంగా లేదు. ఐతే ఓ మూల ఉన్న డ్రమ్మును చూపి పోలీసులు ఆగారు. దానికి మూతలేదు. కాంక్రీట్‌తో పూర్తిగా కప్పేసి ఉంది. ఈ ఇంట్లో ఏదో జరిగిందని ఖాకీలకు అప్పుడు అనుమానం వచ్చింది. దానిని తీసుకెళ్లి ఓపెన్ చేసి చూసి ఖంగుతిన్నారు. ఎందుకంటే అందులో ఓ వృద్ధురాలి మృతదేహం ఉంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడు (Tamilnadu)లోని చెన్నై (Chennai)లో చోటుచేసుకుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... చెన్నై నీలాంకరై సరస్వతి నగర్‌కు చెందిన గోపాల్, షెన్బగం (86) భార్యాభర్తలు. వీరికి ప్రభు, మురుగన్, సురేష్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు సురేష్ వయసు 50 ఏళ్లు. అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం భార్య పిల్లలు సురేష్‌ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. కొడుకు ఒంటరి వాడవడంతో.. అప్పటి నుంచి తల్లి కూడా అతడితో పాటే నివసిస్తోంది. తమ్ముడి వద్ద తల్లిని చూసేందుకు ఈ ఆదివారం ప్రభు వారి ఇంటికి వెళ్లాడు. కానీ సురేష్ తన అన్నని లోనికి రానీయలేదు. అంతేకాదు అమ్మ ఇంట్లో లేదని చెప్పాడు. ఎంత చెప్పినా వినలేదు. కనీసం ఇంట్లోకి కూడా రానీయలేదు.
తమ్ముడు సురేష్ ప్రవర్తనపై ప్రభుకి అనుమానం వచ్చింది. తన తల్లి కనిపించడం లేదని.. తమ్ముడిపైనే అనుమానం ఉందని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సురేష్ ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేశారు. ఆ తర్వాత ప్లాస్టిక్ డ్రమ్ములోనే షెన్బగం మృతదేహం (Man buried mothers dead body in drum ) ఉందని తెలియడంతో షాక్ తిన్నారు. డ్రమ్మును పగులకొట్టి చూస్తే.. నిజంగానే అందులో డెడ్ బాడీ బయటపడింది. మృతదేహాన్ని అందులో పెట్టి దాదాపు 15 రోజులవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సురేష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఐతే తల్లి అనారోగ్యంతో మరణించిందని.. అంత్యక్రియలు చేయలేని పరిస్థితుల్లో సురేష్ ఈ చర్యకు పాల్పడ్డాడని భావిస్తున్నారు. లేదంటే సురేషే తన తల్లిని చంపేసి.. అందులో దాచిపెట్టాడా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.