భార్యభర్తల మధ్య గొడవలు రావడానికి ఎన్నో కారణలుంటాయి. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు. కానీ బెంగళూరుకు చెందిన ఓ భార్య మాత్రం చిన్న కారణంతో తన భర్తను పుట్టింటివారితో చిత్కకొట్టించింది. వివరాల్లోకెళితే..కూతురు చెప్పిన మాట వినలేదని అత్తింటి వారు, ఇతరులు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఇంటి పనులు నిర్వర్తించలేదనే కారణంతో…మామ, అతని బావమరిదితో పాటు నలుగురు వ్యక్తులు కొట్టిన ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 09వ తేదీన కేఆర్ పురంలోని మేదహల్లిలో ఈ ఘటన జరిగింది. గాయత్రి అనే మహిళతో గోపాల కృష్ణ కు 8 నెలల క్రితం వివాహం జరిగింది. ఇందిరానగర్ లో ఉన్న ఓ హోటల్ లో ఇతను పని చేస్తున్నాడు. వివాహం తర్వాత..జేసీ నగర్ లో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. కానీ..అత్తింటిలో తాను నివసించలేనని గాయత్రి వెల్లడించింది.
దీంతో వారిద్దరూ కె.ఆర్.పురం, మేదహల్లిలో అద్దెంట్లో నివాసం ఉంటున్నారు. ఇల్లు కొనడానికి గోపాల కృష్ణ రూ. 4 లక్షల రుణం తీసుకున్నాడు. ఇదిలా ఉంటే…2021, జనవరి 09వ తేదీ శనివారం ఇంట్లో వంట గ్యాస్ అయిపోయింది. దీంతో గ్యాస్ సిలిండర్ తీసుకురావాలని భార్య గాయత్రి సూచించింది. అప్పటికీ గోపాలకృష్ణ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. సోమవారం నింపించుకుని తీసుకొస్తానని, అప్పటి వరకు బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తానని బదులిచ్చాడు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గాయత్రి తన తల్లిదండ్రులకు, సోదరుడికి చెప్పింది. వెంటనే అక్కడకు చేరుకున్న వారు..గోపాల కృష్ణను దూషించడం ప్రారంభించారు.
ఆగ్రహానికి గురైన రవికుమార్ తోపాటు నలుగురు వ్యక్తులు గోపాల కృష్ణన్ ను హోటల్ నుంచి బయటకు లాగి..కొట్టారు. కత్తితో పొడిచే ప్రయత్నం కూడా చేశారు. తర్వాత అతడిని హెచ్చరించి వెళ్లిపోయారు. తలకు తీవ్రగాయాలు కావడంతో..అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తన కొడుకుపై హత్యాయత్నం చేశారని, కానీ..దాడి చేసినట్లు కేసు పెట్టారని బాధితురాలి తల్లి ఆరోపించింది.
Published by:Sridhar Reddy
First published:January 18, 2021, 13:41 IST