భార్య రాసలీలలు భరించలేక.. దారుణానికి పాల్పడ్డ భర్త..

సోమవారం కూడా భార్యాభర్తల మధ్య ఇదే విషయమై వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరు గదుల్లో పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచిన అశోక్.. ఇనుపరాడ్‌తో ఆమె తలపై బాది హత్య చేశాడు.

news18-telugu
Updated: November 6, 2019, 4:09 PM IST
భార్య రాసలీలలు భరించలేక.. దారుణానికి పాల్పడ్డ భర్త..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దారుణం జరిగింది. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో అశోక్ అనే ఓ భర్త.. భార్య రాజేశ్వరిని హత్య చేశాడు. పదేళ్ల క్రితం అశోక్-రాజేశ్వరి దంపతులు ఉపాధి నిమిత్తం పాల్వంచకు వచ్చారు. స్థానికంగా మంచికంటినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజేశ్వరి స్థానికంగా ఓ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఇదే క్రమంలో ఇటీవల ఆమె ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి.. భర్త అశోక్ ఆమెను చాలాసార్లు మందలించాడు. పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించాడు.అయినప్పటికీ రాజేశ్వరి పద్దతితో మార్చుకోకపోగా.. ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూనే ఉంది.

సోమవారం కూడా భార్యాభర్తల మధ్య ఇదే విషయమై వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరు గదుల్లో పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచిన అశోక్.. ఇనుపరాడ్‌తో ఆమె తలపై బాది హత్య చేశాడు. అనంతరం తను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం అవుతున్నా.. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేకపోవడంతో స్థానికులు వచ్చి తలుపు తట్టారు. ఎవరూ తీయకపోవడంతో వెనక వైపు నుంచి లోపలికి వెళ్లి చూశారు.అప్పటికే ఇద్దరూ చనిపోయి కనిపించడంతో పోలీసులక సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

First published: November 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com