నడిరోడ్డుపై దారుణ హత్య.. వెంటాడి కత్తితో పొడిచి చంపారు..

అతడు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. వెంబడించి మరీ దాడిచేశారు దుండగులు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్న మహంతీష్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: November 8, 2019, 5:58 PM IST
నడిరోడ్డుపై దారుణ హత్య.. వెంటాడి కత్తితో పొడిచి చంపారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పట్ట పగలు నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని వెంటాడిన కొందరు దుండగులు.. అతడిని కత్తితో పొడిచి చంపారు. కర్నాటకలోని తుమకూరులో ఈ ఘటన జరిగింది. తమకూరుకు చెందిన మహంతీష్ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కత్తితో పొడిచారు. అతడు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. వెంబడించి మరీ దాడిచేశారు దుండగులు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్న మహంతీష్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading