Telangana: తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు హత్య.. జగిత్యాల జిల్లాలో దారుణం..

తీసుకున్న అప్పు చెల్లించమని అడిగినందుకు గానూ ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. జగిత్యాల లో ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

news18
Updated: November 3, 2020, 11:56 AM IST
Telangana: తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు హత్య.. జగిత్యాల జిల్లాలో దారుణం..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 3, 2020, 11:56 AM IST
  • Share this:
తెలంగాణ లో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న హత్యాఘటనలు ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఒక ఘటన మరువకముందే మరో దారుణం వెలుగులోకి వస్తున్నది. నేరాలు శ్రుతి మించుతున్నాయి. పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా.. భద్రతా చర్యలకు సంబంధించిన సేవలు ఎంతగా విస్తరిస్తున్నా.. నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా.. జగిత్యాల పట్టణంలో ఆదివారం జరిగిన హత్య కలకలం సృష్టించింది. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి తేవడంతో అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బులు చెల్లిస్తానని పిలిచి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

మేడిపల్లి మండలం మన్నె గూడేనికి చెందిన తీపిరెడ్డి గంగారెడ్డి(58) చాలా కకాలం నుండి జగిత్యాల పట్టణం వానినగర్ లో నివసిస్తున్నాడు. ఈయన భార్య చనిపోగా కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. నరేష్ అనే వ్యక్తికి గంగారెడ్డి కొంత కాలం క్రితం అప్పు ఇచ్చాడు. తీసుకున్న డబ్బులు చెల్లించాలని గంగారెడ్డి కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అప్పు చెల్లించలేని స్థితిలో ఉన్న నరేష్ పథకం వేసి ఆదివారం డబ్బులు చెల్లిస్తానని గంగారెడ్డిని జగిత్యాలలోని మంచి నీళ్ల బావి సమీపంలో ఉన్న తన బంధువుల ఇంటికి పిలిచాడు.

అక్కడ మాటా మాటా పెరిగి నరేష్ తన స్నేహితుడైన శ్రీధర్ తో కలిసి గంగారెడ్డి గొంతు పిసికి చంపినట్లు సమాచారం. అయితే అంతలోపే బంధువులు రావడంతో మృతదేహంపై ఓ దుప్పటి కప్పి అతిగా మద్యం తాగాడని చెప్పి అక్కడి నుంచి గంగారెడ్డిని తీసుకెళ్లారు నిందితులు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న మురికి కాలువలో పడేసి పైన చెత్త వేసారు.

ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జగిత్యాలలో కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు.
Published by: Srinivas Munigala
First published: November 3, 2020, 11:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading