news18-telugu
Updated: September 27, 2020, 5:14 PM IST
ప్రతీకాత్మక చిత్రం
అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం నగరంలో ఓ వ్యక్తి గొంతు కోసి దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. నగరంలోని రాంనగర్ లోని 80 ఫీట్ల రోడ్డులో ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్న మహమ్మద్ రఫీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గోపి అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఉదయం రాంనగర్ లో రఫీ ఉండగా.. గోపి అక్కడికి వచ్చి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపాడు. దీంతో కుప్పకూలిన రఫీ అక్కడికక్కడే చనిపోయాడు.
తానే ఈ హత్య చేసినట్లు నిందితుడు హరిజన గోపి నాలుగవ పట్టణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు వివాహతర సంబంధమే కారణమా? లేక ఇతర ఏదైనా వివాదాలు కారణమా? అన్న కోణంలో విచారణ సాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
హత్యకు గురైన మహమ్మద్ రఫీ స్వస్థలం కళ్యాణ్ దుర్గం మండలం మంగళ కుంట గ్రామం. అతను గత కొన్ని ఏళ్లుగా నగరంలోని మంగళవారి కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కళ్యాణదుర్గం రోడ్లో ఉన్న ఓ మహిళతో రెండు సంవత్సరాలుగా రఫీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతని హత్యకు ఈ వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. హత్యకు గురైన మహమ్మద్ రఫీ గతంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వద్ద కొంతకాలం ఫొటో గ్రాఫర్‌గా పనిచేశాడు.
Published by:
Nikhil Kumar S
First published:
September 27, 2020, 5:07 PM IST