‘మా అమ్మతో అక్రమ సంబంధం ఉందని పదే పదే ప్రచారం చేస్తున్నాడు. నాకు ఇది చాలా అవమానంగా అనిపిస్తోంది. వాడిని చంపేయాలి. దానికి నీ సాయం కావాలి‘ అంటూ ఓ యువకుడు తన స్నేహితుడిని అడిగాడు. అతడు సరేనన్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం అతడిని అనుకున్న చోటికి రప్పించారు. మద్యం తాపించి మత్తులోకి దించారు. ఆ తర్వాత ఆ కుర్రాడు అతడిని చంపుతోంటే స్నేహితుడు చూడలేకపోయాడు. చంపుతున్న తీరును చూసి బెంబేలెత్తిపోయి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడిని చంపిన తర్వాత ఆ కుర్రాడు నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాడు. తాను చేసిన ఘోరం గురించి పోలీసులకు పూసగుచ్చినట్టు చెప్పాడు. అవమానం భరించలేకే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పాడు. కడప జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కడప జిల్లా ఓబులవారి పల్లె మండలం చిన్న ఓరంపాడుకు చెందని పిడికిటి సుబ్బారాయుడు అనే వ్యక్తికి నోటు దురుసు ఎక్కువ. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో తనకు అక్రమ సంబంధం ఉందంటూ ఊళ్లో వాళ్లందరికీ పదే పదే చెప్పుకునేవాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి ఆ మహిళ కొడుక్కు తెలిసింది. చివరకు తన స్నేహితులు కూడా ’మీ అమ్మతో అతడికి అక్రమ సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తున్నాడు. నిజమేనా?‘ అని అడగడంతో అవమానంగా భావించాడు. సుబ్బారాయుడిని హతమార్చాలని డిసైడయ్యాడు. దీనికి తన స్నేహితుడి సహాయం అడిగాడు.
ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
సుబ్బారాయుడి హత్యకు ఆ మహిళ కొడుకు పక్కాగా ప్లాన్ వేశాడు. సుబ్బారాయుడిని స్థానికంగా ఉన్న పాములేటి వంకలోని చెక్ డ్యామ్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అతడికి బాగా మద్యం తాగించాడు. పక్కనే అతడి స్నేహితుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత అతడిని మాటల్లోకి దించి తన వెంట తెచ్చుకున్న చాకుతో గొంతు కోశాడు. అయినా అతడు మరణించలేదు. దీంతో పక్కనే దొరికిన వెదురుబొంగుతో అతడిని బాది చంపేశాడు. ఆ ఘటన చూసిన స్నేహితుడు భయపడి బెంబేలెత్తిపోయి అక్కడి నుంచి పరారయ్యాడు. సుబ్బారాయుడిని చంపిన తర్వాత అతడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రియుడితో తల్లి ఎస్కేప్.. తండ్రి బాధను చూడలేక.. పదేళ్ల తర్వాత కన్న కొడుకే పనోడిలా చేరి ఇలా పగతీర్చుకున్నాడు..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Kadapa, Wife kill husband