MAN BRUTALLY KILLED BY UNKNOWN PERSON AND DEAD BODY SEPARATED AS TWO PARTS LEADS TO TENSION IN KUPPAM CHITTOOR HSN TPT
Chittoor: బ్రిడ్జ్ కింద ఓ బ్యాగు.. స్థానికుల్లో భయం భయం.. పోలీసులు వచ్చి ఆ బ్యాగును ఓపెన్ చేసి చూస్తే..
బ్యాగును తీస్తున్న దృశ్యం
బ్రిడ్జి కింద ఓ లగేజీ బ్యాక్ ప్రత్యక్షమయింది. దాన్ని చూసిన స్థానికులు అనుమాన పడ్డారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి ఆ బ్యాగు జిప్ ను ఓపెన్ చేసి చూస్తే..
జాతీయ రహదారి పక్కనే ఓ స్కూలు. దానికి కాస్త దగ్గరలోనే ఓ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి కింద ఓ లగేజీ బ్యాక్ ప్రత్యక్షమయింది. రోజూ అదే దారిలో వస్తూ పోతూ ఉండేవాళ్లకు ఆ లగేజీ బ్యాగ్ కనిపించింది. దాన్ని చూసి వాళ్లు అనుమాన పడ్డారు. ఆ లగేజీ బ్యాగ్ పై ఈగలు, దోమలు వాలుతుండటంతో వాళ్లు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చేసరికే అక్కడ పెద్ద సంఖ్యలో స్థానికులు గుమిగూడారు. పోలీసుల్లో ఒకరు ఆ బ్యాగు జిప్ ను ఓపెన్ చేసి చూస్తే వారికి ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ బ్యాగులో ఏముందో చూసి అంతా కంగుతిన్నారు. ఆ బ్యాగులో ఓ యువకుడి శవం ఉంది. అది కూడా శవంలో సగభాగం మాత్రమే ఉండటం కలకలం రేకెత్తిస్తోంది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
యువకుడిని దారుణంగా హతమార్చిన దుండగులు అతి కిరాతకంగా శరీరాన్ని రెండు ముక్కలు చేశారు. నడుము కింది భాగాన్ని ఓ ప్లాస్టిక్ కవర్ లో చుట్టి లగేజ్ బ్యాగ్ లో ప్యాక్ చేసి పడేసిన ఘటన కుప్పంలో కలకలం రేపుతోంది. కుప్పం- క్రిష్ణగిరి జాతీయ రహదారి లోని నడుమూరు గురుకుల పాఠశాల సమీపంలోని ఓ బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కింద గురువారం ఉదయం ఓ లాగేజీ బ్యాగ్ పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. దాని చుట్టూ ఈగలు ముసురుతుండటంతో వాళ్లకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ లగేజ్ బ్యాగ్ తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ లగేజీ బ్యాగులో ఓ యువకుడి మృతదేహం ఉంది. అది కూడా సగభాగమే ఉంది.
నడుము కింది భాగాన్ని మాత్రమే ఓ ప్లాస్టిక్ కవర్ లో చుట్టి దాన్ని లగేజ్ బ్యాగ్ లో ప్యాక్ చేసి బ్యాగు జిప్ వేసి మరీ దుండగులు బ్రిడ్జ్ కింద పడేశారు. మృతుడికి 25 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. యువకుడిని హతమార్చి మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 2 రోజుల క్రితం యువకుడిని హతమార్చి మృతుని శరీర భాగాన్ని బుధవారం రాత్రి తెచ్చి పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఘటనా స్థలాన్ని కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్, ఎస్సై నరేంద్ర లు పరిశీలించి మృతదేహం శరీర భాగాల్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.