వివాహేతర సంబంధం గురించి ఫోన్లో గొడవ.. అర్ధరాత్రి 11.30 గంటలకు ఇద్దరూ బయటకు వచ్చి..

విక్రమ్ (ఫైల్ ఫొటో)

మీ ఇద్దరి నిర్వాకం గురించి ఆమె భర్తకు తెలిస్తే ఘోరాలు జరుగుతాయి. ఓ కుటుంబం ఆగమయిపోతుంది. ఏదైనా జరగకూడనిది జరిగితే పిల్లలు అనాథలయిపోతారు. ప్లీజ్ నా మాట విను.. అంటూ మంచిగా చెప్పాడతను. కానీ..

 • Share this:
  మంచి చెప్తే చెడు ఎదురవుతుందన్న సామెతను మీరు వినే ఉంటారు. ‘వద్దు. నువ్వు చేస్తున్న పని తప్పు. ఆమెతో వివాహేతర సంబంధం మానుకో. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీ ఇద్దరి నిర్వాకం గురించి ఆమె భర్తకు తెలిస్తే ఘోరాలు జరుగుతాయి. ఓ కుటుంబం ఆగమయిపోతుంది. ఏదైనా జరగకూడనిది జరిగితే పిల్లలు అనాథలయిపోతారు. ప్లీజ్ నా మాట విను’ అంటూ అతడికి ఓ వ్యక్తి మంచి మాటలు చెప్పాడు. పద్ధతిగా ఉండమన్నాడు. అంతే, అలా చెప్పడమే అతడి ప్రాణాల మీదకు వచ్చింది. తనకే నీతులు చెబుతావా? అంటూ అతడు రెచ్చిపోయాడు. నానా దుర్భాషలు ఆడాడు. అర్ధరాత్రి ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు రప్పించి మరీ దారుణంగా చంపేశాడు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటకు చెందిన కుందారపు విక్రమ్ అనే 28 ఏళ్ల వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సుమలత అనే మహిళను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తనకు సమీప బంధువయిన ఓ మహిళతే అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పులిచేరు సంతోష్ కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం విక్రమ్ కు తెలిసింది. సంతోష్ ను హెచ్చరించాడు. పద్ధతి మానుకోమన్నాడు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనీ, ఈ విషయం తెలిస్తే ఆ కుటుంబం ఆగమయిపోతుందని వాపోయాడు. వారి కాపురాన్ని కూల్చొద్దని కోరాడు. అయినప్పటికీ సంతోష్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పురాలేదు. మంచిగా చెబితే కుదరదని ఓసారి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

  సోమవారం రాత్రి కూడా ఈ విషయం గురించి ఫోన్లోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్తా తీవ్ర రూపం దాల్చింది. దమ్ముంటే బయటకు రా.. నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకుందాం.. అంటూ ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో ఇద్దరూ బయటకు వచ్చారు. విక్రమ్ ఎదురుపడగానే సంతోష్ తన వద్ద ఉన్న కత్తి, ఇనుపరాడ్ తో దాడి చేశాడు. దీంతో విక్రమ్ తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడు చనిపోయాడని స్థానికులు నిర్ధారించారు. రాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులు వచ్చి మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, తన భర్త మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలనీ, తనకు న్యాయం చేయాలని సుమలతతోపాటు, ఆమె బంధువులు మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
  Published by:Hasaan Kandula
  First published: