ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రకాశం జిల్లా (Prakasham District) కేంద్రమైన ఒంగోలు (Ongole) పట్టణంలో చిన్నపాటి గొడవకే ఓ వ్యక్తి.. యువకుడ్ని దారుణంగా పొడిచిచంపాడు. మర్డర్ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణంలో దారుణంగా జరిగింది. తన భార్యను వేధస్తున్నాడన్న కోపంతో భర్త ఓయువకుడ్ని నడిరోడ్డుపై పొడిచిచంపాడు. అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చేదిన జోసెఫ్ అనే వ్యక్తి భార్య ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తోంది. అదే మాల్ లో థామస్ అనే యువకుడు కూడా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇద్దరి మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. ఇదే విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. దీంతో జోసెఫ్.. థామస్ పై కోపం పెంచుకున్నాడు. ఇది పెద్ద విషయం కాదని భార్య జోసెఫ్ కు చెప్పినా వినలేదు. ఒకసారి మాట్లాడతానని చెప్పి భార్యతో ఫోన్ చేయించాడు. దీంతో అతడు గాంధీ పార్క్ వద్దకు వచ్చాడు. దీంతో అక్కడికొచ్చిన థామస్ పై.. నిందితుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు.
పరుగెత్తినా వెంటాడి...
తప్పించుకునే ప్రయత్నంలో అతడు రోడ్డుమీదకు పరుగులు పెట్టినా వదలకుండా విచక్షణా రహితంగా పొడిచాడు. మొత్తం 10సార్లు థామస్ శరీరంలో కత్తితో పొడిచాడు. దీంతో ఘటనాస్థలిలోనే అతడు మృతి చెందాడు. భార్య అడ్డుకుంటున్నా లెక్కచేయకుండా జోసెఫ్ అతడిపై దాడి చేస్తూనే ఉన్నాడు. ఓ ఆటో డ్రైవర్ గట్టిగా పట్టుకోవడంతో శాంతించాడు. అనంతరం దంపతులిద్దరూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. మర్డర్ చేస్తున్న దృశ్యాలు గాంధీ పార్క్ సమీపంలోని ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Recent murder video in #Ongole.. Sorry for posting but pakkana okkadu kuda aapataaniki raavatla.. Murdered for involving in extra marital affair.. Happened infront of Gandhi Park which is in centre of the Town.. pic.twitter.com/VMZ5moX89O
పోలీసులు నిందితుడిపై హత్యకేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నడిరాడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. హత్యను చూసిన వారు బెంబేలెత్తిపోయారు. ఒక్కనిముషం ఏం జరుగుతుందో అర్ధంకాక చూస్తూ ఉండిపోయారు. చివరకు ఓ వ్యక్తి అడ్డుకొవడంతో నిందితుడు దాడి చేయడం ఆపాడు.
ఏం జరిగిందో చెప్తుండగానే..!
జోసెఫ్ భార్య ఫోన్ చేయగానే గాంధీ పార్క్ వద్దకు వచ్చిన థామస్.. "అక్కా నీతో అలా మాట్లాడాల్సింది కాదు" అని అంటుండానే జోసెఫ్ అతడిపై దాడి చేసినట్లు నిందితుడి భార్య పోలీసులకు తెలిపింది. మృతుడు థామస్.. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. ఉదయాన్నే ఇంటింటికీ పాలు వేస్తూ, ఆ తర్వాత షాపింగ్ మాల్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని స్థానికులు చెప్పారు. చిన్నపాటి గొడవకే నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడని అతడి తల్లిదండ్రులు వాపోతున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.