హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : రెండో భార్యతో ఇంట్లో భర్త..ఇళ్లు తగులబెట్టిన మొదటి భార్య..నలుగురు మృతి

Shocking : రెండో భార్యతో ఇంట్లో భర్త..ఇళ్లు తగులబెట్టిన మొదటి భార్య..నలుగురు మృతి

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Wife Sets House On Fire : పెళ్లి అయి దశాబ్ద కాలం గడుస్తున్నా పిల్లలు లేరు. పిల్లల కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా,గుళ్ల చుట్టూ తిరిగినా లాభం లేదు.

Wife Sets House On Fire : పెళ్లి అయి దశాబ్ద కాలం గడుస్తున్నా పిల్లలు లేరు. పిల్లల కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా,గుళ్ల చుట్టూ తిరిగినా లాభం లేదు. దీంతో భార్యలో లోపం ఉందని భావించిన భర్త..పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకున్నాడు. దీనిని పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మొదటి భార్య..రెండో భార్యతో భర్త ఇంట్లో ఉన్న సమయంలో సొంత ఇంటికి నిప్పు పెట్టింది.. ఆ మంటల్లోనే ఆమె కూడా కాలిపోయింది. శనివారం బీహార్ రాష్ట్రంలోని దర్బాంగ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...దర్బాంగలోని బీరౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుపాల్ బజార్‌లో నివాసం ఉంటున్న 40 ఏళ్ల ఖుర్షీద్ ఆలం- బీబీ పర్వీన్‌(35)భార్యాభర్తలు. వీరికి పదేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఆ దంపతులకు సంతానం కలగలేదు. బిడ్డ కోసం ఎన్ని ప్రయత్నాలు చేపినా ఫలించలేదు. దీంతో పిల్లలు అంటే ఇష్టం ఉన్న ఖుర్షీద్ ఆలం...రెండేళ్ల క్రితం సమీపంలోని గ్రామానికి చెందిన 32 ఏళ్ల రోష్నీ ఖాతూన్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ భర్త రెండో పెళ్లి చేసుకోవడంపై మొదటి భార్య బీబీ పర్వీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండో పెళ్లి చేసుకుంటే తీవ్ర పరిణామాలతో ఖుర్షీద్‌ను బెదిరించేది.

ALSO READ Shocking : చిన్నారిని తొక్కేసిన వాహనం..వాహనానికి నిప్పు పెట్టి డ్రైవర్ ను తోసేసిన స్థానికులు

అయినా ఖుర్షీద్..రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 5 గంటల సమయంలో భర్త,రెండో భార్య ఇంట్లో నిద్రిస్తుండగానే పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటించింది బీబీ పర్వీన్. ఈ ఘటనలో పర్వీన్, ఆమె 65 ఏళ్ల అత్త రుఫైదా ఖతూన్ కాలి బూడిదయ్యారు. రోష్నీ ఖాతూన్, ఖుర్షీద్​ ను తొలుత సమీపంలోని కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​ తీసుకెళ్లి, అక్కడినుంచి ధర్భంగా  హాస్పిటల్​ కు తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ మరణించారు. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులుఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు.

First published:

Tags: FIRE

ఉత్తమ కథలు