news18-telugu
Updated: October 6, 2020, 6:46 AM IST
ప్రతీకాత్మక చిత్రం
వరుసకు కూతురు అయ్యే యువతిపై ఓ కామాంధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన మేడ్చల్ జిల్లా నెరేడ్మెట్ పోలీసు స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. జయరాం అనే వ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో మానస్పర్ధలు రావడంతో ఆమెకు కొన్నేళ్ల క్రితం విడాకులు ఇచ్చాడు. అనంతరం కొద్ది రోజులు జయరాం ఒంటరి జీవితం గడిపాడు. ఆ తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకున్న మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు 17 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ఆ బాలికను తమతోనే ఉంచుకుందామని, సొంత బిడ్డలా చూసుకుంటానని జయరాం రెండో భార్యకు మాట ఇచ్చాడు. ఈ మాటలు నమ్మిన ఆమె ఎంతో మురిసిపోయింది. దీంతో అంతా కలిసే ఉంటున్నారు.
అయితే రెండో పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకు జయరాంలోని మృగాడు బయటకు వచ్చాడు. రెండో భార్య కుమార్తె కన్ను వేసిన జయరాం.. ఆమెను లైంగిక వేధించడం మొదలుపెట్టాడు. తల్లి ఇంట్లో లేని సమయంలో బాలికపై వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయం కాస్త బాలిక తల్లికి తెలియడంతో.. ఆమె తన బంధువుల వద్ద గోడు వెళ్లబోసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం బాలికను బంధువుల ఇంటికి పంపింది.
ఇది నచ్చని జయరాం బాలికను ఇంటికి తీసుకురావాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. భర్త ఆగడాలు భరించలేక ఆ మహిళ ఈ విషయంపై ఆదివారం నేరేడ్మేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సోమవారం జయరాంను అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Published by:
Sumanth Kanukula
First published:
October 6, 2020, 6:41 AM IST