కర్నూలులో దారుణం.. ఇంట్లో ఎవరు లేని సమయంలో గర్భిణిని రేప్ చేసిన యువకుడు

కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో దారుణం చోటుచేసుకుంది. గర్భిణి ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరిన ఓ వ్యక్తి ఆమెను రేప్ చేశాడు.

news18-telugu
Updated: October 1, 2020, 2:31 PM IST
కర్నూలులో దారుణం.. ఇంట్లో ఎవరు లేని సమయంలో గర్భిణిని రేప్ చేసిన యువకుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో దారుణం చోటుచేసుకుంది. గర్భిణి ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరిన ఓ వ్యక్తి ఆమెను రేప్ చేశాడు. మంగళవారం జరిగిన ఒక్కరోజు ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మండలంలోని నందివర్గం గ్రామానికి చెందిన ఐదు నెలల గర్భిణి భర్త మంగళారం నంద్యాలకు వెళ్లగా.. ఇంటి వద్ద ఆమె ఒంటరిగా ఉంది. దీంతో గర్భిణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన సురేష్ ఆమె ఇంట్లో చొరబడ్డాడు.

గర్బిణి నోట్లో గుడ్డ‌కుక్కి రేప్ చేశాడు. మధ్యాహనం సమయంలో మరోసారి రేప్ చేశాడు. సాయంత్రం భర్త ఇంటికి రావడంతో బాధితురాలు జరిగిన విషయాన్ని అతనికి చెప్పింది. అనంతరం భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.ఈ ఘటనకు సంబంధించి పోలీసులను వివరణ కోరగా.. సురేష్ అనే వ్యక్తి రేప్ చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. దీంతో నిందితుడు సురేష్‌ను అరెస్ట్ చేసి.. బాధితురాలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

గర్భిణిని రేప్ చేసిన సురేష్ గతంలో నంద్యాల మున్సిపాలిటీలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేవాడు. కాలపరిమితి పూర్తై ఉద్యోగం పోవడంతో గ్రామానికి వచ్చి కూలి పనులు చేస్తూ జీవినం సాగిస్తున్నాడు.
Published by: Sumanth Kanukula
First published: October 1, 2020, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading