news18-telugu
Updated: April 7, 2020, 1:57 PM IST
ప్రతీకాత్మక చిత్రం
అసలే ఓ వైపు ప్రజలు కరోనా మహమ్మారి దెబ్బకు గజగజ వణికిపోతుంటే... హైదరాబాద్ రాంనగర్లో ఒక్కసారిగా క్షుద్రపూజల కలకలం రేగింది. స్థానికంగా ఓ పార్టీకి చెందిన నాయకుడు క్షుద్రపూజలు చేసి... ఆ వ్యర్థాలను వాటర్ ట్యాంక్లో వేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి చర్యలను గమనించిన కొందరు స్థానికులు... అతడిని ప్రశ్నించి నిర్బంధించారు. అతడిని ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Published by:
Kishore Akkaladevi
First published:
April 7, 2020, 1:47 PM IST