Home /News /crime /

MAN BOOKED FOR MAKING INDECENT GESTURES AT WOMAN IN MUMBAI SU

భర్తతో కలిసి కారులో నైట్ డ్రైవ్‌కు వెళ్లిన మహిళ.. ఫాలో చేసిన బైకర్.. మధ్య వేలు చూపించి..

(ప్రతీకాత్మక చిత్రం - image credit - youtube)

(ప్రతీకాత్మక చిత్రం - image credit - youtube)

రాత్రి సమయంలో భర్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్న మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తప్పుడు సంజ్ఞలు చూపిస్తూ ఆమెను వేధింపులకు గురిచేశాడు.

    కుటుంబ సభ్యులతో కలిసి నైట్ డ్రైవ్‌కు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కారులో వెళ్తున్న ఆమెను ఓ బైకర్ తన చేష్టలతో వేధించాడు. వారు వెళ్తున్న కారును ఫాలో చేసి.. చేతి మధ్య వేలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు. మార్చి 12వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి బాధిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులు తొలుత డీబీ మార్గ్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ కేసు తర్వాత మెరైన్ డ్రైవ్ పోలీసులకు ట్రాన్స్‌ఫర్ అయింది. ‘రాత్రి 10.15 గంటల ప్రాంతంలో మేము ఎస్‌సీపీఏ నుంచి గిర్‌గామ్ చౌపట్టి వైపు కారులో వెళ్తున్నాం. నా భర్త కారు నడుపుతున్నాడు. నేను ఆయన పక్క సీట్‌లోనే కూర్చొని ఉన్నాను. పిల్లలు, ఇతర కుటుం సభ్యులు వెనక సీట్లలో ఉన్నారు. మెరైన్ ప్లాజా హోటల్ ముందు ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు చేరుకున్న సమయంలో.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి సౌత్ బౌండ్ రోడ్డు నుంచి యూటర్న్ తీసుకున్నాడు. నా భర్త అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని గిర్‌గామ్ చౌపట్టి వైపు పొనిచ్చాడు. అయితే కొద్దిసేపటికే బైక్‌పై ఉన్న వ్యక్తి మమ్మల్ని ఫాలో చేయడం మొదలుపెట్టాడు. అతను నాకు మధ్య వేలు చూపించాడు. దీంతో నా భర్త కారును రోడ్డు పక్కన ఆపి.. ఇలా ఎందుకు చేశావు అని ప్రశ్నించాడు. దీంతో అతడు మాతో గొడవకు దిగాడు"అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఈ ఘటనపై ఆమె భర్త మిడ్-డే తో మాట్లాడుతూ..‘బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని ఫాలో చేశారు. నేను నిందితుడితో మాట్లాడుతుండగా అతడు నాతో వాదనకు దిగాడు. నేను అక్కడ కనిపించిన ఓ పోలీసును సాయం కోసం పిలిచాను. ఇది చూసిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అతనితో పాటు ఉన్న మరో వ్యక్తిని మేము పట్టుకున్నాం. అతన్ని సమీపంలోని పోలీస్ చౌకీకి తీసుకెళ్లాం. అనంతరం నిందితుడు 30 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్నాడు. అనంతరం మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది’అని తెలిపారు.

    మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి ఈ సంఘటనను ధ్రువీకరించారు. తాము నిందితుడిని అరెస్ట్ చేశామని.. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Molestation, Mumbai

    తదుపరి వార్తలు