Home /News /crime /

MAN BOOKED FOR HARASSING MARRIED WOMAN IN PRAKASHAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Married Woman: భర్తకు ఫోన్ చేసి నీ భార్యను పంపాలంటూ వేధింపులు.. పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీన్ రివర్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Harassment: ఓ మహిళపై కన్నేసిన కామాంధుడు.. తన కోరిక తీర్చాలని ఆమె బలంవంతం చేయడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా ఆమె భర్తకు ఫోన్ చేసి నీ భార్యను పంపాలని బెదిరించడం మొదలుపెట్టారు. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు లేవు సరికదా తిరిగి బాధితురాలిపైనే దాడి చేశాడు.

ఇంకా చదవండి ...
    ఈ రోజుల్లో మహిళలు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారికి వేధింపులు మాత్రం తప్పడం లేదు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థునులు, ఉద్యోగాలు చేసేవారి నుంచి పెళ్లైన వారికి కూడా వేధింపులు తప్పడం లేదు. ఓ మహిళపై కన్నేసిన కామాంధుడు.. తన కోరిక తీర్చాలని ఆమె బలంవంతం చేయడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా ఆమె భర్తకు ఫోన్ చేసి నీ భార్యను పంపాలని బెదిరించడం మొదలుపెట్టారు. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు లేవు సరికదా కేసు పెడతావా అంటూ ఆ కామాంధుడు తిరిగి బాధితురాలిపైనే దాడి చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) కనిగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు కొంతకాలం క్రితం పెళ్లైంది.

    ప్రస్తుతం ఆమెకు ఐదు నెలల వయసున్న బాబు ఉన్నాడు. ఐతే ఇదే మండలంలోని తాళ్లూరు గ్రామానికి చెందిన సీహెచ్ ఏడుకొండలు అనే వ్యక్తి ఆమెకు తరచూ ఫోన్ చేసి లైంగికంగా వేధిస్తున్నాడు. అంతేకాదు ఆమె భర్తకు ఫోన్ చేసి నీ భార్యను పంపాలని.. లేకపోతే చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఈనెల 17న జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది.

    ఇది చదవండి: కట్టుకున్న భర్తే అంత మాట అనే సరికి తట్టుకోలేకపోయింది... ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది


    అనంతరం కనిగిరి చేరుకొని నడుచుకుంటూ వెళ్తుండగా పామూరు బస్టాండ్ సమీపంలో ఆమెపై ఏడుకొండలు దాడికి పాల్పడ్డాడు. నాపైనే కేసు పెడతావా అంటూ దుర్పాషలాడుతూ విచక్షణారహితంగా కొట్టాడు. కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని.. భర్తను తరిమేస్తానంటూ బెదరించాడు. అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లిన బాధితురాలు ఆ కామాంధుడిపై మరోసారి కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంత జరిగినా పోలీసులు మాత్రం అతడిపై చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది.

    ఇది చదవండి: మూడేళ్లు వెంటపడి అమ్మాయిని పెళ్లికి ఒప్పించాడు.. తాళి కట్టిన తర్వాతి రోజే ట్విస్ట్


    ఇటీవల కృష్ణా జిల్లా లో పెనమలూరు మండలం పెదపులిపాకకు చెందిన ఓ యువతికి ఐదేళ్ల క్రితం పెళ్లైంది. ఐతే భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చుండూరు రాకేష్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ జ్యోతి వెనుక పడటం ప్రారంభించాడు. మూడేళ్లుగా అమె వెనుక పడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడి ప్రేమను అంగీకరించింది. ఈ నెల 16న విజయవాడ గుణదలలోని ఓ ప్రార్ధనా మందిరంలో ఆమెకు తాళికట్టాడు. అనంతరం ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాతి తనను కాపురానికి తీసుకెళ్లాలని భర్తకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త రాకేష్ తో పాటు అతడి తల్లి మాణిక్యంపై కేసు నమోదు చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Harassment on women, Prakasham dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు