పసిపాప నుంచి పండు ముసలి దాకా మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కన్నకూతుళ్లపైనే అత్యాచారానికి (father molested daughter) ఒడిగడుతోన్న కీచక తండ్రుల ఉదంతాలు ఇటీవల పెరగడం కలవరపెడుతున్నది. వికారాబాద్ జిల్లాలో కూలీ పనులు చేసుకునే ఓ వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి కన్నకూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మూడు రోజుల కిందట వెలుగులోకి వచ్చింది. పదే పదే మైనర్ బాలికపై లైంగికదాడి చేయడంతో ఆమె గర్భందాల్చింది. కూతురు ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తల్లి ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండ్రోజుల కిందట అనంతపురం జిల్లా గుంతకల్లులోనూ పెయింటర్ గా పనిచేసే ఓ వ్యక్తి తన 15ఏళ్ల కూతురిపై లైంగికదాడి చేయగా, తల్లి సహాయంతో చివరికి తండ్రిపై కేసు పెట్టిందా బిడ్డ. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో మరో కీచక తండ్రి ఉదంతం వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు చెప్పిన వివరాలివి..
కడుపున పుట్టిన బిడ్డపైనే కన్నేశాడో కీచకుడు. కామంతో కళ్లుమూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. తాగుబోతు భర్త వేధింపులు భరించలేక భార్య దూరంగా ఉంటోందని కన్నకూతురిపై కన్నేశాడు. ఉచ్చం నీచం మరిచి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ అత్యంత అమానుష ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలోని మంతటి గ్రామానికి చెందిన భీమయ్య.. రోజూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు.
భర్త వేధింపులు భరించలేకపోయిన భార్య అతనికి దూరంగా ఉంటోంది. భార్య దగ్గరికి రాలేదని ఒంటరిగా ఉన్న కూతురినే చెరబట్టాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. మౌనంగా కుమిలిపోతున్న యువతిని గమనించిన నానమ్మ నెమ్మదిగా ఆరా తీయడంతో నాన్న చేసిన ఘోరం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minor girl raped, Nagarkarnol district, Nagarkurnool, Rape case