నగ్న ఫొటోలు పంపు... యువతికి బెదిరింపులు... యువకుడు అరెస్టు...

అసలు అతను ఆమెను ఎలా బెదిరించగలిగాడు? ఏ పరిస్థితులు ఆమెను ఉచ్చులో పడేశాయి? ఇదంతా ఎలా జరిగింది? ఆమె ఎలా తప్పించుకోగలిగింది?

news18-telugu
Updated: June 7, 2020, 6:35 AM IST
నగ్న ఫొటోలు పంపు... యువతికి బెదిరింపులు... యువకుడు అరెస్టు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మేక వన్నె పులులు అంటారు కదా... అతను అలాంటి వాడే. పైకి మేకలా అమాయకంగా ఉండేవాడు. తెరవెనక వాడో క్రూరుడు. అసలేం జరిగిందంటే... హైదరాబాద్... బోడుప్పల్‌లో ఉంటున్నాడు ప్రవీణ్ కుమార్. అక్కడ ఓ యువతి... రోజూ అటుగా వెళ్తూ ఉండేది. ఆమెపై కన్నేశాడు. ఎలాగొలా తనవైపు తిప్పుకోవాలని... ఆమె చూస్తున్నప్పుడు ఏవో రెండు మూడు మంచి పనులు చేశాడు. అవి చూసి... అతను మంచివాడనే అభిప్రాయం ఆమెకు కలిగింది. అదే అదనుగా ఆమెతో స్నేహం ప్రారంభించాడు. ఆమె కూడా అదే ఏరియా వాడు కదా అని మాట్లాడటం ప్రారంభించింది. అలా ఆమెను తనవైపు తిప్పుకున్నట్లుగా... భావించాడు.

స్నేహంలో మరో మెట్టు పైకి ఎక్కి... ఆమెతో సెల్ఫీల వంటివి దిగడం మొదలుపెట్టాడు. తనకు అలాంటివి నచ్చవని చెప్పింది. ఉత్తినే... ఊరికే... నాతో ఎవరు స్నేహం చేసినా ఇలాగే తీసుకుంటా అంటూ కటింగ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో స్టెప్... ఈసారి ఆమెను సింగిల్ ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. ఎందుకు తీస్తున్నారని అడిగితే... ఏదో అదో తృప్తి. ఫొటోలు తీయడం నేర్చుకుంటున్నా. బయటి వాళ్లను తీస్తే ఊరుకోరు కదా. మీలాంటి తెలిసిన వాళ్లను తీయడం ద్వారా... నా క్రియేటివిటీకి పదును పెట్టుకుంటున్నా.... అంటూ నాటకాలాడాడు. ఇష్టం లేకపోయినా... పోనీలే అని లైట్ తీసుకుంది. ఇలా ఆమెకు సంబంధించిన 20 ఫొటోల దాకా సేకరించిన తర్వాత కొత్త డ్రామా మొదలుపెట్టాడు.

ఫేస్‌బుక్‌లో ఓ నకిలీ అకౌంట్ తెరిచాడు. దాని ద్వారా... ఆమెకు మెసేజ్‌లు పంపాడు. "నీ ఎక్స్‌పోజింగ్, న్యూడ్ ఫొటోలు పంపు. లేదంటే... నీ బండారం బయటపెడతా" అనేవాడు. ఆమె ఎవరు నువ్వు. ఏంటి నువ్వు బయటపెట్టేది.... అని రివర్సైంది. ఆమె లొంగకపోవడంతో... ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. ఆ ఫొటోలను ఫేస్ బుక్ ద్వారా ఆమెకు పంపాడు. నువ్వు గనక నగ్న ఫొటోలు పంపకపోతే... ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. వాటన్నింటినీ... నీ ఫ్రెండ్స్ అందరికీ పంపుతాను. సోషల్ మీడియాలో షేర్ చేస్తాను అని బ్లాక్‌మెయిల్ చేశాడు.

ఇలాంటివి ఎన్నో రోజూ వార్తల్లో చూస్తున్న ఆమెకు మేటర్ అర్థమైంది. తనతో స్నేహం పేరుతో ఇన్నాళ్లూ తిరిగిన ప్రవీణ్ కుమారే ఇదంతా చేశాడని క్లియర్‌గా తెలిసింది. మేక వెనక ఉన్న పులి స్వరూపాన్ని గుర్తించింది. కట్ చేస్తే... ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం... సైబర్ క్రైమ్ పోలీసులు... పక్కా ఆధారాలు సేకరించడం, అతన్ని అరెస్టు చేయడం అన్నీ జరిగాయి. అలా ఆ కేటుగాడి తిక్క కుదిరింది.
First published: June 7, 2020, 6:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading