యువతితో ఏడాది పాటు సహజీవనం...మోసపోయానని యువకుడు ఏం చేశాడంటే...

యువతి మాత్రం తనకు మంచి పెళ్లి సంబంధం వచ్చిందని తెలుసుకొని కుమార్ కు హ్యాండిచ్చేసింది. అయితే వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదని బుకాయించింది.

news18-telugu
Updated: July 4, 2020, 11:29 PM IST
యువతితో ఏడాది పాటు సహజీవనం...మోసపోయానని యువకుడు ఏం చేశాడంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏడాది పాటు సహజీవనం చేసిన ప్రియురాలికి వేరొక వ్యక్తితో పెళ్లి చేస్తుండటాన్ని సహించలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురుగ్రాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురుగ్రాంకు చెందిన కుమార్‌(23) అదే ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసి ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని సహజీనం చేశారు. అయితే యువతి మాత్రం తనకు మంచి పెళ్లి సంబంధం వచ్చిందని తెలుసుకొని కుమార్ కు హ్యాండిచ్చేసింది. అయితే వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదని బుకాయించింది.

దీంతో మసస్తాపం చెందిన కుమార్ తన ప్రియురాలు మరో పెళ్లి చేసుకున్నాక తానెందుకు జీవించడం అనుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన అతడి తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ లెటర్ ద్వారా అసలు విషయాలు బయటపడ్డాయి. యువకుడి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
Published by: Krishna Adithya
First published: July 4, 2020, 11:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading