హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: భార్యను హత్య చేసి.. తలతో 12 కిలోమీటర్ల ప్రయాణం.. కారణం ఏంటంటే..

Shocking: భార్యను హత్య చేసి.. తలతో 12 కిలోమీటర్ల ప్రయాణం.. కారణం ఏంటంటే..

తలతో వెళ్తున్న నకఫోడి మాఝీ

తలతో వెళ్తున్న నకఫోడి మాఝీ

Odisha: భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. ఎవరితో మాట్లాడిన గొడవ పడేవాడు. ఇద్దరి మధ్య ప్రతి రోజు వాగ్వాదం జరిగేది. ఈ క్రమంలో అతను కంట్రోల్ తప్పి అమానవీయంగా ప్రవర్తించాడు.

కొంత మంది మగాళ్లు అనుమానంతో తమ భార్యలను వేధిస్తుంటారు. ప్రతిదానికి కట్టుకున్న పెళ్లాల మీద అనుమాన పడుతుంటారు. ఎవరితో మాట్లాడిన, అందంగా తయారైన అనుమానపడుతుంటారు. మరికొందరు .. మరీ దారుణంగా భార్యలకు ఫోన్ మాట్లాడనివ్వరు. ప్రతి దానికి కండీషన్ లు పెడుతుంటారు. చివరికి ఇంట్లో వారితో కూడా మాట్లాడటానికి అసలూ ఒప్పుకోరు. బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లోనే భార్యలను లాక్ వేసి వేళ్లే మగాళ్లు కూడా ఉంటారు. మరికొందరు.. పిల్లలు కలిగాక కూడా భార్యలపై అనుమానంతోనే ఉంటారు. ఇలాంటి వాళ్లు.. తరచుగా భార్యలతో గొడవలు పడుతుంటారు. కొన్ని సార్లు కంట్రోల్ తప్పి కూడా ప్రవర్తిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఒడిశాలో (Odisha) అమానవీయ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఢెంకనాల్ జిల్లాలోని చంద్రశేఖర్‌పూర్ గ్రామంలో దారుణం జరిగింది. నకఫోడి మాఝీ అనే వ్యక్తి తన భార్యను నరికి చంపి, తలతో ఊరిలో ప్రయాణించాడు. అతడిని ఇద్దరు పిల్లలు. తన భార్యపై ఎప్పుడు అనుమానంతో ఉండేవాడు. భార్య ఎవరితో మాట్లాడిన.. అందంగా ముస్తాబైన ఆరోజు ఇంట్లో నానా హంగామా చేసేవాడు. ఈ క్రమంలో.. అతగాడు.. తన భార్యను కత్తితో నరికి చంపాడు.

ఆ తర్వాత.. తలను, మొండెం నుంచి వేరు చేసి, దాదాపు 12 కిలో మీటర్లు ప్రయాణం చేశాడు. అయితే, అతగాడి చేతిలో మహిళ తల ఉండటాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు.. నకఫోడి మాఝీని అదుపు లోనికి తీసుకున్నారు. అతడిని అదుపు లోనికి తీసుకుని విచారించగా.. తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఢిల్లీలో (Delhi) అమానవీయ ఉదంతం వెలుగులోనికి వచ్చింది.

స్థానికంగా ఉన్న వసంత్‌ విహార్‌లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పదవ తరగతికి చెందిన బాలిక.. తన స్నేహితులతో సరదాగా గడపటానికి వెళ్లింది. వారంతా కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత.. బాలిక స్పృహలో లేనప్పుడు ఆమెను కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత.. ముగ్గురు స్నేహితులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే.. ఘటన తర్వాత.. బాలికను ఆమె ఇంటిదగ్గర వదిలేసి వెళ్లిపోయారు. అయితే, ఈ ఘటన జూలై 6 న జరిగింది.

బాలిక తీవ్ర భయాందోళనలకు గురవ్వడాన్ని ఇంట్లో వారు గమనించారు. ఈ క్రమంలో బాలిక జరిగిన దారుణాన్ని ఇంట్లో వారికి తెలిపింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. బాలికను టెస్ట్ ల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Female harassment, Murder, Odisha

ఉత్తమ కథలు