Nupur sharma supporter murder: గత కొన్ని రోజులుగా బహిషృత బీజేపీ నేత నుపుర్ శర్మ (Nupur Sharma)వ్యాఖ్యలపై జరుగుతున్న ఘటనలు అందరికీ తెలిసిందే. ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా మొహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రపంచంలోని పలు దేశాలు కూడా నుపుర్ శర్మ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. అయితే ఇప్పుడు ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఓ టైలర్(Tailor)ని ఇద్దరు దుండగులు దారుణంగా కత్తులతో నరికి చంపారు(Brutally Murder). కిరాతకంగా నరికి తల, మొండెం వేరు చేశారు. రాజస్తాన్(Rajastan)రాష్ట్రంలోని ఉదయ్ పూర్(Udaipur)లో ఈ ఘటన జరిగింది. వ్యక్తిని దారుణంగా చంపేసిన తర్వాత ఆ ఇద్దరు అగంతకులు టైలర్ ని చంపుతున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మల్దాస్ వీధిలో కన్హయ్య లాల్ అనే వ్యక్తి టైలర్‌గా పనిచేస్తున్నాడు. వృత్తిరీత్యా టైలర్ అయిన కన్హయ్య కొద్ది రోజుల క్రితం నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్‌ను పెట్టుకున్నాడు. మంగవారం(జూన్ 28)అతని షాపులోకి ఇద్దరు ముస్లిం యువకుడు కస్టమర్లలా ప్రవేశించారు. ఓ వ్యక్తి వద్ద కొలతలు తీసుకున్న తర్వాత కన్నయ్యపై అతడు కత్తితో దాడి చేశాడు. మరో వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు. ఘటన జరిగిన ప్రదేశం రక్తపుమడుగులా మారింది. హత్య అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి బైక్‌పై పారిపోయారు. ఆ తర్వాత కాసేపటికి హత్య తమపనేనని ఇద్దరు వ్యక్తులువీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రధాని మోదీని కూడా చంపుతామని ఆ వీడియోలో హెచ్చరించారు. ఆ వీడియోలో ఇద్దరు నిందితుల్లో ఒకరు తనను తాను రియాజ్ అని, మరొకరు మహ్మద్ అని పరిచయం చేసుకున్నారు. హత్యకు గురైన టైలర్ కొన్ని రోజుల క్రితం నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్‌ను పెట్టుకున్నాడు. దీనిపై రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని, ఇందులో భాగంగానే ఇప్పుడు టైలర్‌ను హత్య చేసినట్టు పోలీస్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ వెల్లడించారు. ఈ హత్యపై దర్యాప్తు చేపట్టినట్లు ఉదయ్‌పుర్ ఎస్పీ తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బైక్‌పై హెల్మెట్లు ధరించి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. రాజ్సమద్ వద్ద గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Helicopter Fell In Sea : సముద్రంలో కుప్పకూలిన హెలికాఫ్టర్..నలుగురు మృతి
టైలర్‌ని నరికి చంపిన రియాజ్ అత్తారికి..ఐసిస్ ఉగ్రసంస్థతో ISISతో సంబంధం కలిగి ఉన్నాడని ఉన్నతాధికర వర్గాలు CNN-News18కి తెలిపాయి. రాజస్తాన్ లోని టోంక్ పట్టణంలో నివాసం ఉంటున్న ముజీబ్ అబ్బాసీతో 2021లో అత్తారి మూడు సందర్భాల్లో సంప్రదింపులు జరుపినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో రత్లాంకు చెందిన కొంతమంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
టైలర్ హత్య అనంతరం ఉదయ్పుర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. హత్య చేసిన వారిని అరెస్టు చేసి మృతుడి కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. దుకాణాలను మూసివేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ విధించారు. రాష్ట్రమంతా అలర్ట్ ప్రకటించారు. ఆందోళనలను సద్దుమణిగేలా చేయడానికి పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అంతేకాకుండా ఐదు కంపెనీల రాజస్థాన్ సాయుధ కాన్‌స్టాబుల్స్ తో సహా సుమారు 600 మంది సిబ్బందిని ఉదయపూర్‌కు పంపినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి వదంతులను పట్టించుకోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందరూ శాంతియుతంగా ఉండాలని సూచించారు.
ఈ హత్యా ఘటనపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. హత్యలను సీఎం తీవ్రంగా ఖండించారు. సు విచారణను అత్యంత వేగంగా జరుపుతామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హత్యకు సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దని ప్రజలను కోరారు. అందరూ శాంతియుతంగా ఉండాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Burtally murder, Crime news, Rajastan