పెళ్లైన తొమ్మిదిరోజులకే నవవధువుకు వేధింపులు... అక్కా,బావతో కలిసి

ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. సోలాపూర్‌కు చెందిన సల్మాన్ పటేల్... సబాను పెళ్లి చేసుకున్నారు. ఓవారం పాటు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఆమెకు అసలు టార్చర్ మొదలయ్యింది.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 3:16 PM IST
పెళ్లైన తొమ్మిదిరోజులకే నవవధువుకు వేధింపులు... అక్కా,బావతో కలిసి
ప్రతీకాత్మక చిత్రం
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 3:16 PM IST
ఎన్ని కేసులు పెడుతున్నా ... కఠిన శిక్షలు విధిస్తున్న మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా వరకట్న వేధింపులకు మరో యువతి బలైంది. పెళ్లైన కొన్నిరోజులకే అమ్మాయికి అత్తింటివాళ్లు నరకం చూపించారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, ఆడపడుచులు వేధింపులకు గురిచేశారు. పెళ్లైన తొమ్మిదిరోజుకే... పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావలంటూ దాడికి దిగారు.దీంతో తీవ్రగాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

సోలాపూర్‌కు చెందిన సల్మాన్ పటేల్... సబాను పెళ్లి చేసుకున్నారు. ఓవారం పాటు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఆమెకు అసలు టార్చర్ మొదలయ్యింది. పెళ్లైన తొమ్మిదో రోజు నుంచి అదనపు కట్నం కోసం సబాను వేధించడం మొదలుపెట్టాడు భర్త సల్మాన్. పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలన్ని ఒత్తిడి చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు. ఈ నేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన భార్యను కూడా సల్మాన్ విడిచి పెట్టలేదు. అక్కడకు వెళ్లి కూడా అదనపు కట్నం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీనికి ఒప్పుకోకపోవడతో సబాను తీవ్రంగా కొట్టాడు. భర్త చేసిన దాడిలో తీవ్రగాయాలపాలైన సబా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భర్త సల్మాన్‌తో పాటు సోదరి ముంతాజ్, ఆమె భర్త షారుక్ పటాన్‌లపై కూడా కేసు నమోదు చేశారు.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...