భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య. అదనపు కట్నం కోసం అత్తారింటి టార్చర్ తట్టుకోలేక మహిళ సూసైడ్(Suicide). బలవంతంగా ఇష్టం లేని పెళ్లిచేశారని యువతి బలవన్మరణం. భర్త అనుమానిస్తున్నాడని మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న భార్య. ఇలాంటి వార్తలే ఇప్పటి వరకు అందరం చూశాం. కాని ఆదిలాబాద్(Adilabad)జిల్లాలో సీన్ రివర్స్ అయింది. తనను భార్య బలవంతంగా పెళ్లి చేసుకుందని చెప్పి ఓ భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. ఆత్మహత్యాయత్నానికి ముందు తాను అనుభవిస్తున్న టార్చర్(Torture), భార్య పెడుతున్న చిత్రహింసలను సెల్ఫీ వీడియో(Selfie video)ద్వారా ప్రపంచానికి తెలియజేసి ప్రాణాలు తీసుకోవాలని చూశాడు.
బలవంతంగా పెళ్లి చేసుకొని..
పెళ్లిళ్లు స్వర్గాన నిర్ణయించబడతాయని పెద్దలు చెబుతుంటారు. కాని ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఓ యువకుడు తన పెళ్లిని తన భార్యే నిర్ణయించిందని బాధపడిపోయాడు. తనకు ఇష్టం లేకపోయినా ..బలవంతంగా తనను వివాహం చేసుకుందని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కలగూడకు చెందిన ఫిరోజ్ అనే యువకుడు పురుగుల మందు తాగాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు తన భార్య పెట్టే వేధింపులు, తనపై కక్ష తీర్చుకునే విధానాన్ని సెల్ఫీ వీడియోలో స్పష్టంగా చెప్పిన భార్యా బాధితుడు ఆ తర్వాత పురుగులు మందు తాగాడు.
భర్తను టార్చర్ పెట్టిన భార్య..
భార్యను వదిలించుకోలేక, ఆమె పెట్టే వేధింపులు తట్టుకోలేక , కలిసి కాపురం చేయలేక చివరకు ప్రాణాలు తీసుకోవడమే సరైన మార్గం అని భావించాడు ఫిరోజ్. అందుకే పురుగుల మందు తాగాడు. సెల్ఫీ వీడియో ద్వారా విషయం తెలుసుకున్న బంధువులు అతడ్ని ముందుగా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ప్రధానాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఫిరోజ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.
తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్..
ఫిరోజ్ మనసులో బాధను సెల్ఫీ వీడియో ద్వారా చెప్పుకోవడం చూసిన వాళ్లంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏ మగాడికి ఇలాంటి కష్టం రాకూడదని కోరుతున్నారు స్థానికులు, బంధువులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.