లిఫ్ట్ ఇస్తానని బైక్‌పై ఎక్కించుకొని యువతిని...నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి...

యువతి వద్దని వారించినప్పటికీ, ఎలాగైనా తన బైక్ ఎక్కాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో యువతి సరేనని అతడి బైక్ ఎక్కింది. కాస్తా దూరం వెళ్లిన తర్వాత వర్షం పడుతోందని..షార్ట్ కట్‌లో వెళితే ఇంటికి త్వరగా చేరుకోవచ్చని తెలివిగా దారి తప్పించాడు.

news18-telugu
Updated: September 6, 2019, 5:32 PM IST
లిఫ్ట్ ఇస్తానని బైక్‌పై ఎక్కించుకొని యువతిని...నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పరిచయస్తుడే కదా లిఫ్ట్ ఇస్తానంటే బైక్ ఎక్కిందో యువతి...కానీ కాసేపటికే నిందితుడి అసలు స్వరూపం బయటపడింది. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన యువకుడు తమ గ్రామానికి వెళుతుండగా, బస్టాప్ లో బస్ కోసం వేచి చూస్తున్న బాధితురాలిపై కన్నుపడింది. వెంటనే ఆమె ముందు బైక్ ఆపి బాధితురాలిని ఇంటి దాకా లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికాడు. అందుకు యువతి వద్దని వారించినప్పటికీ, ఎలాగైనా తన బైక్ ఎక్కాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో యువతి సరేనని అతడి బైక్ ఎక్కింది. కాస్తా దూరం వెళ్లిన తర్వాత వర్షం పడుతోందని..షార్ట్ కట్‌లో వెళితే ఇంటికి త్వరగా చేరుకోవచ్చని తెలివిగా దారి తప్పించాడు.

ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి బైక్ ను తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే యువతి తీవ్రంగా ప్రతిఘటించి, అక్కడి నుంచి పారిపోయి, పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
First published: September 6, 2019, 5:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading