సినిమా చాన్స్ పేరిట యువతిని గదిలోకి పిలిచి...దారుణం...

ఇంతలో ఓ వ్యక్తి వచ్చి కాపీ తాగమని ఆఫర్ చేశాడు. అది తాగగానే యువతి అపస్మారక స్థితిలోకి జారుకుంది. కాసేపటికే యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ప్రయత్నం చేశాడు.

news18-telugu
Updated: August 9, 2020, 8:24 PM IST
సినిమా చాన్స్ పేరిట యువతిని గదిలోకి పిలిచి...దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సినిమాల్లో రాణించాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ఓ యువతిపై, కొందరు దుర్మార్గులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే ఢిల్లీకి చెందిన నైనా( పేరు మార్చాం) సినిమా అవకాశాల కోసం ముంబై చేరుకుంది. అక్కడే ఓ ప్రముఖ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరిన ఆ యువతి తన అదృష్టం పరీక్షించుకోవడం ప్రారంభించింది. చిన్న చితక యాడ్ ఫిలింలు, మోడలింగ్ షూట్స్ లో పాల్గొన్న నైనా సరైన అవకాశం కోసం ఎదురు చూసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వచ్చిన ఓ యాడ్ ద్వారా అవకాశం కోసం ప్రయత్నించింది. అడ్వర్టయిజ్ మెంట్ లో ఉన్న ఫోన్ నెంబర్ కు కాల్ చేయగా, ఆడిషన్స్ కోసం ఓ అడ్రస్ చెప్పాడు. అక్కడకు వెళ్లగా నిర్మానుష్యమైన పాత బిల్డింగ్ కనిపించింది. దీంతో ఆ యువతి అనుమానంతో బిల్డింగ్ లో చెప్పిన అడ్రస్ కు చేరింది. డోర్ బెల్ కొట్టి లోపలికి వెళ్లగానే ముగ్గురు వ్యక్తులు కనిపించారు. అక్కడే ఆడిషన్స్ వెయిట్ చేయమని ఓ కుర్చీలో కూర్చోబెట్టారు. కాసేపు అయ్యాక, యువతిని గదిలోకి పిలిచారు. వారు చెప్పినట్లు చేయాలన్నారు. అందుకు యువతి సరేనన్నది. సినిమా డైలాగులు ఇచ్చి ప్రాక్టీసు చేయమన్నారు.

ఇంతలో ఓ వ్యక్తి వచ్చి కాపీ తాగమని ఆఫర్ చేశాడు. అది తాగగానే యువతి అపస్మారక స్థితిలోకి జారుకుంది. కాసేపటికే యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ప్రయత్నం చేశాడు. కాసేపటికి ఆమెకు మెలకువ రాగానే చేతికి అందిన వస్తువుతు బలంగా అతడి తలపై బాది అక్కడి నుంచి బయటపడింది. పరిగెత్తుకుంటూ పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిన సంగతి తెలపగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగితా నిందితులు పరారీలో ఉన్నారు. కేసు విచారణలో ఉంది.
Published by: Krishna Adithya
First published: August 9, 2020, 8:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading