అమ్మాయిపై యువకుడి లైంగిక దాడి.. వీడియో కూడా తీసి.. సోషల్ మీడియాలో వైరల్.. ఎందుకిలా చేశావని అడిగితే.. షాకింగ్ సమాధానం

ప్రతీకాత్మకచిత్రం

Brother In Law: ఓ యువకుడు తన స్నేహితుడి సాయంతో అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది. కేవలం అమ్మాయిపై లైంగిక దాడి చేయడం మాత్రమే కాదు.. దానికి సంబంధించి ఓ వీడియోను కూడా తీశాడు ఆ యువకుడు.

 • Share this:
  భరత్‌పూర్: తన అక్కను తన బావ వేధించడం అతడికి ఏ మాత్రం నచ్చలేదు. కొన్నేళ్లు బావ చేతిలో వేధింపులు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్న తన అక్కను చూసి ఆ తమ్ముడు తట్టుకోలేకపోయాడు. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో చాలామంది పోలీసులు ఆశ్రయిస్తుంటారు. తమ వారిని వేధిస్తున్న వారిపై కేసు నమోదు చేయడమో లేక ఏదో రకంగా వారికి సర్ధిచెప్పి మళ్లీ అలా జరగకుండా చూడటమో చేస్తుంటారు. కానీ తన అక్కను వేధించిన బావను, ఆయన కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎవరూ ఊహించని ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అసలు అతడు ఈ రకమైన చర్యలకు పాల్పడతాడని ఎవరూ ఊహించలేదు.

  రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ ప్రాంతంలోని మథుర గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన స్నేహితుడి సాయంతో అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది. కేవలం అమ్మాయిపై లైంగిక దాడి చేయడం మాత్రమే కాదు.. దానికి సంబంధించి ఓ వీడియోను కూడా తీశాడు ఆ యువకుడు. ఆ వీడియోను వారిని బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉపయోగించలేదు. ఏకంగా ఓ గ్రూప్‌లో వీడియోను పోస్ట్ చేసి కలకలం రేపాడు.

  విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వాళ్లు నిందితుడని.. అతడికి సహకరించిన వ్యక్తిని అరెస్ట్ చేశాడు. ఎందుకు ఇలా చేశావని విచారించారు. దీనికి అతడి నుంచి వచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. నిందితుడు లైంగిక దాడికి పాల్పడిన అమ్మాయి మరెవరో కాదు.. స్వయానా అతడి బావ చెల్లెలు. దీని వెనుక ప్రేమ వంటి కారణాలు కూడా ఏమీ లేవు. తన బావ తన అక్కను వేధిస్తున్నాడన్న ఒకే ఒక్క కారణంతో ఆయన చెల్లెలిపై లైంగిక దాడి చేశాడు యువకుడు.

  Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

  Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

  తన అక్కపై బావ వేధింపులు తట్టుకోలేకపోయాయని.. అందుకే వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నానని పోలీసులకు తెలిపాడు. అందుకే ఆమెపై లైంగిక దాడికి పాల్పడి వీడియో తీసి వైరల్ చేశానని చెప్పాడు. ఘటనకు కారణమైన యువకుడు, అతడికి సహకరించిన మరో యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని కోర్టులో హాజరుపరిచారు.
  Published by:Kishore Akkaladevi
  First published: