దేశంలో మహిళల పట్ల అరాచాకాలు మాత్రం ఆగటం లేదు. ఢిల్లీలో శ్రధ్దావాకర్ హత్య ఘటన పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అదే విధంగా.. కొంత మంది కామాంధులు మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఏదోరకంగా మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతిరోజు మహిళలపై జరుగుతున్న దాడులు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా,మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. కేరళలో (Kerala) అమానుష ఘటన జరిగింది. శనివారం ఉదయం కలూరులోని కొచ్చి ప్రాంతంలోని ఆజాద్ రోడ్ లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఆజాద్ రోడ్ వద్ద ఉదయం 11 గంటలకు ఒక వ్యక్తి, అటుగా వెళ్తున్న ఇద్దరు యువతులతో వాగ్వాదానికి దిగాడు. వారు ప్రతిఘటించడంతో, ఒక కొడవలి పట్టుకుని మరీ వారిపై దాడికి యత్నించాడు. దీంతో ఒక్కసారిగా యువతులిద్దరు భయంతో వణికిపోయారు. చుట్టుపక్కల వారు కూడా భయంతో వారి దగ్గరకు రాలేదు.
ఒక యువతి ధైర్యంతో అతని దాడిని ప్రతిఘటించింది. దీంతో చుట్టుపక్కల వారు రావడంతో అతను కొడవలి వదిలేసి బైక్ మీద పారిపోయాడు. అయితే.. దుండగుడి పెనుగులాటలో యువతులకు మాత్రం గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Kerala